News February 18, 2025

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల

image

AP: మే నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను TTD ఈరోజు ఉదయం 10 గం.కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించి నేటి నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10గంటల వరకు ఆన్‌లైన్లో భక్తులు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాటి చెల్లింపుల్ని ఈ నెల 20 నుంచి 22వ తేదీల మధ్యలో చేయాల్సి ఉంటుంది. మే నెల గదుల కోటాను టీటీడీ ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.

Similar News

News March 22, 2025

ఈ ఏడాది నైరుతిలో వర్షపాతం సాధారణమే

image

జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో కురిసే నైరుతి వర్షపాతం వ్యవసాయానికి కీలకం. ఈ ఏడాది అది సాధారణంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. నిరుడు డిసెంబరులో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి బలహీనమైన లానినా, ఈ ఏడాది మరింత బలహీనమవుతుందని వారు పేర్కొన్నారు. నైరుతి వచ్చేనాటికి ఎల్‌నినో వస్తుందని అంచనా వేశారు. పసిఫిక్, హిందూ మహాసముద్రాల మీదుగా చల్లగాలులు భారత్‌లోకి ప్రవేశించడం వల్ల నైరుతి వర్షాలు కురుస్తుంటాయి.

News March 22, 2025

రాష్ట్రంలో కొత్తగా 70 బార్ల ఏర్పాటు!

image

TG: ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తులు చేస్తోంది. కొత్తగా 70 బార్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ఇన్‌కమ్ ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 1,171 బార్లు ఉండగా వీటిలో సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్నాయి. మైక్రోబూవరీల సంఖ్యను పెంచే అవకాశమున్నట్లు సమాచారం.

News March 22, 2025

టెన్త్ పరీక్షలు.. విద్యాశాఖ వార్నింగ్

image

TG: రాష్ట్రంలో తొలి రోజు టెన్త్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రశ్నాపత్రం లీకైందంటూ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ప్రచారం తప్పని కొట్టిపారేసింది. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా నిన్న జరిగిన పరీక్షకు 99.67శాతం హాజరు నమోదైనట్లు తెలిపింది.

error: Content is protected !!