News August 19, 2024
OCT 4 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు TTD వెల్లడించింది. 4న ధ్వజారోహణం, పెద్దశేష వాహనం, 5న చిన్నశేష వాహనం, హంస వాహనం, 6న సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, 7న కల్పవృక్ష వాహనం, భూపాల వాహనం, 8న మోహినీ అవతారం, గరుడ వాహనం, 9న స్వర్ణ రథం, గజ వాహనం, 10న సూర్యప్రభ వాహనం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం, ధ్వజావరోహణం ఉంటుందని తెలిపింది.
Similar News
News November 20, 2025
అనంతపురంలో కిలో టమాటా రూ.47

టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. కిలో రూ.30-40 వరకు పలుకుతున్న టమాటా ధర బుధవారం ఏకంగా రూ.47 పలికింది. దీంతో అనంతపురం జిల్లా రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న కక్కలపల్లి మార్కెట్కు 2,145 టన్నులు వచ్చినట్లు ఇన్ఛార్జి రూప్ కుమార్ తెలిపారు. చలితీవ్రత కారణంగా దిగుమతి తగ్గడంతో క్యాప్సికమ్, దొండకాయ, బెండకాయ, గోరుచిక్కుడు, క్యారట్ తదితర కూరగాయల రేట్లు కూడా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
News November 20, 2025
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటన

ఏపీ, తెలంగాణలో పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొననున్నారు. 22న పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరగనున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరవుతారని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. తొలుత 21న హైదరాబాద్లో ‘భారతీయ కళామహోత్సవ్- 2025’ను రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. అనంతరం శనివారం పుట్టపర్తికి వెళ్లనున్నారు.
News November 20, 2025
చెరకు పంటను ఇలా నరికితే ఎక్కువ లాభం

చెరకు పంటను నరికేటప్పుడు గడలను భూమట్టానికే నరకాలి. కొన్ని ప్రాంతాల్లో భూమి పైన రెండు, మూడు అంగుళాలు వదిలేసి నరుకుతుంటారు. ఇలా చేయడం వల్ల రైతుకు నష్టం. మొదలు కణపులలో పంచదార పాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటు పంచదార అటు బెల్లం దిగుబడులు కూడా తగ్గుతాయి. చెరకును భూమట్టానికి నరికి ఖాళీ చేసిన తోటల్లో వేళ్లు లోతుగా చొచ్చుకెళ్లి తోట బలంగా పెరిగి వర్షాకాలంలో వచ్చే ఈదురు గాలులు, వర్షాలను కూడా తట్టుకుంటుంది.


