News November 16, 2024
శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.12కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు వేంకటేశ్వరుడి దర్శనానికి 8గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 61,613మంది భక్తులు దర్శించుకోగా, 20,291మంది తలనీలాలు సమర్పించారు. శుక్రవారం స్వామివారి హుండీ ఆదాయం రూ.3.12కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిన్న తిరుమల మాడ వీధుల్లో వైభవంగా గరుడసేవ నిర్వహించారు.
Similar News
News December 3, 2024
ఆ విషయంలో ‘గేమ్ ఛేంజర్’ రికార్డు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా 2025 జనవరి 10న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో అమెరికాలోని డల్లాస్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. తాజాగా వేదిక వివరాలను మేకర్స్ వెల్లడించారు. ఈనెల 21న సాయంత్రం 6 గంటలకు Curtis Culwell Cente, గార్లాండ్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఓ ఇండియన్ సినిమా USAలో ప్రీరిలీజ్ అవ్వడం ఇదే తొలిసారని మేకర్స్ వెల్లడించారు.
News December 3, 2024
7 IPOలకు సెబీ గ్రీన్ సిగ్నల్.. విలువ రూ.12,000 కోట్లు
మరో ఏడు కంపెనీల IPOలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఈకామ్, స్మార్ట్‌వర్క్ కోవర్కింగ్ స్పేసెస్, ట్రూఆల్ట్, జెమాలాజికల్, కెరారో, కాంకర్డ్, వెంటివ్ హాస్పిటాలిటీ ఉన్నాయి. IPOల ద్వారా సంస్థలు దాదాపు రూ.12,000 కోట్లు సమీకరించనున్నాయి. జెమాలాజికల్ అత్యధికంగా రూ.4వేల కోట్లు సమీకరించనుంది. మరోవైపు 2025లో జెప్టో పబ్లిక్ ఇష్యూకు వీలున్నట్లు కంపెనీ కో ఫౌండర్ ఆదిత్ పాలిచా వెల్లడించారు.
News December 3, 2024
పాగల్ ‘ఫెంగల్’.. 1,500kmల ప్రభావం
ఫెంగల్ తుఫాను భిన్న రూపాల్లో ముప్పుతిప్పలు పెట్టింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి ఓసారి బలహీనపడుతూ, కొన్ని గంటలకే బలపడుతూ పుదుచ్చేరి వద్ద తీరం దాటింది. దాని ప్రభావం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి మీద మాత్రమే కాకుండా 1,500km దూరంలోని ఒడిశాపైనా చూపింది. 5 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీని తీవ్రత ఇవాళ సాయంత్రం నుంచి తగ్గుముఖం పడుతుందని IMD వెల్లడించింది.