News February 17, 2025

ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం: చంద్రబాబు

image

AP: దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం ఉండాలని CM చంద్రబాబు అన్నారు. భారతీయులు ఉన్న ప్రతి దేశంలోనూ బాలాజీ ఆలయం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుపతిలో జరిగిన టెంపుల్స్ కన్వెన్షన్ ఈవెంట్‌లో CM మాట్లాడారు. ‘ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఓ AI నిపుణుడు తయారవుతున్నాడు. ఆలయాల నిర్వహణకు టెక్నాలజీ ఉపయోగించాలి. రాష్ట్రంలోని ఆలయాల్లో మౌలిక వసతులు పెంచాం’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News March 23, 2025

EVల బీమాకు భారీగా పెరిగిన డిమాండ్

image

ఎలక్ట్రిక్ వాహనాల బీమాకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. గత మూడేళ్లలో 16 రెట్లు పెరిగినట్లు పాలసీబజార్ అంతర్గత డేటా చెబుతోంది. EV కార్ల బీమా పాలసీల వాటా FY23లో కేవలం 0.50%గా ఉండగా, మార్చి 2025 నాటికి 14%కి విస్తరించి 8.2% వద్ద నిలిచింది. ఢిల్లీ, బెంగళూరు, పుణే, చెన్నై, ముంబై సిటీల్లో ఈవీల వాడకం ఎక్కువగా ఉందని, 55% బీమా పాలసీలు ఈ నగరాల్లోనే కొనుగోలు చేస్తున్నట్లు పాలసీ బజార్ నివేదిక పేర్కొంది.

News March 23, 2025

యశ్వంత్ వర్మపై విచారణకు కమిటీ

image

జస్టిస్ <<15855484>>యశ్వంత్ వర్మ<<>> నివాసంలో భారీగా నగదు దొరకడంపై CJI అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పంజాబ్&హర్యానా HC CJ షీల్ నాగు, హిమాచల్‌ప్రదేశ్ HC CJ సంధవాలియా, కర్ణాటక HC CJ అను శివరామన్ ఉన్నారు. ఈ విచారణ సమయంలో వర్మకు ఎలాంటి న్యాయపరమైన పనులు అప్పగించవద్దని సీజేఐ ఆదేశించారు. పారదర్శకత కోసం ఢిల్లీ HC CJ రిపోర్ట్‌తో పాటు వర్మ స్టేట్‌మెంట్‌ను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

News March 23, 2025

కొత్త డీజీపీ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

image

AP: కొత్త DGP ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు IPS అధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. ఈ లిస్టులో రాజేంద్రనాథ్ రెడ్డి, మాదిరెడ్డి ప్రతాప్, హారీశ్ కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లు ఉన్నాయి. ఇందులో ముగ్గురి పేర్లను కేంద్రం తిరిగి రాష్ట్రానికి పంపనుంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ DGPగా ఉన్న హరీశ్ కుమార్‌నే మరో రెండేళ్లు DGPగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

error: Content is protected !!