News March 9, 2025
నేటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు

AP: ఇవాళ రాత్రి 7 గంటలకు శ్రీవారి వార్షిక సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనుండగా పుష్కరిణిలో భక్తులకు స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. తెప్పోత్సవాల కారణంగా ఈ నెల 13 వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను అధికారులు రద్దు చేశారు.
Similar News
News March 15, 2025
సౌతాఫ్రికా రాయబారికి ట్రంప్ సర్కారు షాక్

తమ దేశంలోని దక్షిణాఫ్రికా రాయబారి ఇబ్రహీం రసూల్‌కు ట్రంప్ సర్కారు షాకిచ్చింది. ఆయన తమ దేశంలో ఉండటానికి వీల్లేదని, వెంటనే స్వదేశానికి పయనమవ్వాలని తేల్చిచెప్పింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘ఇబ్రహీం ఓ జాత్యహంకార రాజకీయ నేత. అమెరికన్లను, మా అధ్యక్షుడిని ద్వేషిస్తున్నారు. ఆయనతో మాట్లాడేదేం లేదు. దేశం నుంచి పంపించేయడమే’ అని పేర్కొన్నారు.
News March 15, 2025
హిందీ భాషపై కామెంట్స్.. పవన్‌పై వైసీపీ విమర్శలు

AP: జయకేతనం సభలో ‘హిందీ మన భాషే కదా?’ అన్న పవన్ <<15763560>>కళ్యాణ్‌పై<<>> YCP విమర్శలు గుప్పిస్తోంది. అప్పట్లో ‘హిందీ గో బ్యాక్’ అనే పేపర్ ఆర్టికల్‌ను పవన్ ట్వీట్ చేయడాన్ని గుర్తుచేస్తోంది. ఆ ఆర్టికల్‌పై స్పందించిన ఆయన ‘నార్త్ ఇండియా రాజకీయ నేతలు మనదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకొని, గౌరవించాలి’ అని రాసుకొచ్చారు. మరి ఇప్పుడేమో జనసేనానికి హిందీపై ప్రేమ పుట్టుకొచ్చిందా? అంటూ ప్రశ్నలు సంధిస్తోంది.
News March 15, 2025
నిద్రలేమితో అనారోగ్యమే!

మనిషికి నిద్ర చాలా ముఖ్యమైనది. తగినంత నిద్రలేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గురక నిద్రలేమికి సంకేతమని చెబుతున్నారు. నిద్రలేమితో కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. సరైన నిద్ర ఉంటే 30-60% రోగుల్లో ఆల్జీమర్స్, గుండె జబ్బులు తగ్గుతున్నాయని తెలిపారు. ఏకధాటిగా 6-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.