News May 20, 2024
రూ.5వేలకు ఓటు అమ్ముకున్న ఎస్సై.. సస్పెన్షన్

AP: డబ్బుకు ఓటును అమ్ముకోవద్దని చెప్పాల్సిన SI తన ఓటు అమ్ముకుని సస్పెండ్ అయ్యారు. మంగళగిరి టౌన్ ఎస్సై ఖాజాబాబుకు ప్రకాశం(D) కురిచేడులో ఓటు ఉంది. SIతో ఓటు వేయిస్తామని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5వేలు తీసుకుని.. SIకి ఆన్లైన్లో పంపారు. ఆ తర్వాత డబ్బులు పంచుతూ సదరు నాయకుడు పోలీసులకు చిక్కాడు. విచారణలో SIకి నగదు పంపినట్లు తేలింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News December 2, 2025
టుడే టాప్ స్టోరీస్

* హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం: CM CBN
* CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత
*ప్రాజెక్టులకు తక్కువ వడ్డీలకే రుణాలివ్వాలి: CM రేవంత్
* TG: ‘భూధార్’ కార్డుల కోసం ‘mభూధార్ యాప్’
* GHMCలో 27మున్సిపాలిటీల విలీనానికి గవర్నర్ ఆమోదం
* పదేళ్లలో రూ.34 లక్షల కోట్లు పెరిగిన విదేశీ అప్పు
*ఎయిపోర్టుల్లో GPS స్పూఫింగ్ జరిగింది: కేంద్రం
* పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు
News December 2, 2025
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: RTC ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముందడుగు పడింది. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోకి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు NMUA, ఎంప్లాయీస్ యూనియన్లకు సభ్యత్వం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చల్లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలూ పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి వివరించి పరిష్కారాల కోసం చర్చలు జరపవచ్చు.