News May 20, 2024

రూ.5వేలకు ఓటు అమ్ముకున్న ఎస్సై.. సస్పెన్షన్

image

AP: డబ్బుకు ఓటును అమ్ముకోవద్దని చెప్పాల్సిన SI తన ఓటు అమ్ముకుని సస్పెండ్ అయ్యారు. మంగళగిరి టౌన్ ఎస్సై ఖాజాబాబుకు ప్రకాశం(D) కురిచేడులో ఓటు ఉంది. SIతో ఓటు వేయిస్తామని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5వేలు తీసుకుని.. SIకి ఆన్‌లైన్‌లో పంపారు. ఆ తర్వాత డబ్బులు పంచుతూ సదరు నాయకుడు పోలీసులకు చిక్కాడు. విచారణలో SIకి నగదు పంపినట్లు తేలింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News December 14, 2024

APPLY NOW: 526 ఉద్యోగాలు

image

ITBPలో 526 SI, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. SI పోస్టులకు డిగ్రీ/బీటెక్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్/డిప్లొమా, కానిస్టేబుల్ పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణత ఉండాలి. SI ఉద్యోగాలకు 20-25 ఏళ్లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18-25 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 18-23 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
వెబ్‌సైట్: <>recruitment.itbpolice.nic.in<<>>

News December 14, 2024

KTRను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే: పాడి కౌశిక్ రెడ్డి

image

TG: హీరో అల్లు అర్జున్‌ను నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నిన్ననే బెయిల్ పేపర్లు అందినా జైలు అధికారులు ఆయనను ఇవాళ రిలీజ్ చేయడం ఏంటని నిలదీశారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని అంటున్నారని, ఆయనను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు.

News December 14, 2024

ICUలో అద్వానీ: లేటెస్ట్ హెల్త్ అప్డేట్

image

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని LK అద్వానీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఢిల్లీ అపోలో ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. నిజానికి రెండు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రికి వచ్చారని తెలిసింది. శనివారం మాత్రం ICUలో అడ్మిట్ చేశారు. సీనియర్ న్యూరాలజిస్ట్ వినిత్ సూరీ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 97ఏళ్ల అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.