News August 16, 2024

నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న SSLV-D3

image

AP: అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఇవాళ ఉదయం 9.17 గంటలకు SSLV-D3 ప్రయోగం చేపట్టనుంది. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. విపత్తు నిర్వహణలో ఇది పంపే సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది. SSLV-D3 ప్రయోగం నేపథ్యంలో నిన్న ఇస్రో సైంటిస్టులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఉపగ్రహం నమూనాకు ప్రత్యేక పూజలు చేయించారు.

Similar News

News September 19, 2024

వాయు కాలుష్యంతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు

image

వాయు కాలుష్యంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఎక్కువని భారత్ సహా పలు దేశాల పరిశోధకులు చేసిన సంయుక్త అధ్యయనంలో తేలింది. ‘బ్రెయిన్ స్ట్రోక్‌’ మరణాల్లో 14శాతం వాయు కాలుష్యం వల్లేనని వారు పేర్కొన్నారు. గగనతల కాలుష్యం, ఉష్ణోగ్రతల పెరుగుదల వలన గత 3 దశాబ్దాల్లో మెదడు సంబంధిత మరణాలు బాగా పెరిగాయని వివరించారు. బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల సంఖ్య 1990తో పోలిస్తే 2021 నాటికి 70 శాతం పెరిగిందని తెలిపారు.

News September 19, 2024

మీ ఇంట్లో ఫ్రిజ్ శుభ్రం చేయకపోతే మహిళల్లో ఈ సమస్యలు!

image

మ‌హిళ‌ల్లో యూరిన‌రీ స‌మ‌స్య‌లు (UTI) ఇంట్లోని ఫ్రిజ్ వ‌ల్ల కూడా వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని US అధ్య‌య‌నం అంచ‌నా వేసింది. కుళ్లిన మాంసాన్ని ఫ్రిజ్‌లో ఉంచ‌డం వ‌ల్ల ఎస్చెరిచియా కోలై (E-Coli) అనే బ్యాక్టీరియా ఏర్ప‌డి అది ఇత‌ర ప‌దార్థాల‌కు వ్యాపించే ప్ర‌మాదం ఉంది. దీంతో UTI సమస్యలు వస్తున్నట్టు అంచనా వేసింది. ఇంట్లోని ఫ్రిజ్‌ను త‌ర‌చుగా శుభ్రం చేయ‌డం మహిళల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

News September 19, 2024

ఫోలిక్ యాసిడ్‌ కోసం ఏ వంటలు మంచివంటే..

image

ఫోలిక్ యాసిడ్ మన శరీరానికి చాలా కీలకం. ప్రధానంగా గర్భిణుల్లో ఇది అత్యవసరం. కొన్ని వంటకాల్లో సహజంగా ఫోలిక్ యాసిడ్‌ను సహజంగా పొందవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. అవి: పాలకూర, పన్నీర్, శనగలు, సాంబారు, రాజ్మా, మెంతికూర. వీటిలో సహజంగా ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లు లభిస్తాయని వివరిస్తున్నారు. అయితే, గర్భిణులు ముందుగా వైద్యుల సలహాను తీసుకున్న తర్వాత వీటిని తినాలని సూచిస్తున్నారు.