News February 18, 2025

SSMB29 రెండో షెడ్యూల్ షురూ

image

రాజమౌళి డైరెక్షన్‌లో మహేశ్ బాబు నటిస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం SSMB29 షూటింగ్ రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్‌‌ శివారులో నిర్మించిన ఓ ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సోదరుడి వివాహం కోసం బ్రేక్ తీసుకున్న ప్రియాంకా చోప్రా మళ్లీ సెట్‌లో అడుగుపెట్టారు. మరోవైపు ఈ వేసవిలో విదేశాల్లో షూటింగ్‌కు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Similar News

News April 18, 2026

ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

*లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు
*అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు
*రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టాం: రాహుల్
*విపక్షాలపై అమిత్ షా, చంద్రబాబు, వైఎస్ జగన్ ఫైర్
*రేపు దేశవ్యాప్తంగా నిరసనలకు NDA పిలుపు
*హార్ముజ్ ఓపెన్ చేశాం: ఇరాన్
*అంబానీని దాటేసి.. ఆసియా కుబేరుడిగా అదానీ

News April 18, 2026

GT vs KKR.. ఎవరు గెలిచారంటే?

image

IPL-2026లో KKRకు మరో ఓటమి ఎదురైంది. కేకేఆర్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ గిల్ 86 పరుగులతో రాణించారు. అంతకుముందు గ్రీన్ 79 రన్స్ చేయడంతో కేకేఆర్ 180 పరుగులు చేయగలిగింది. ఇది GTకి మూడో విజయం కాగా, KKRకు 5వ ఓటమి.

News April 18, 2026

1 Min లేటైనా CETకు అనుమతి లేదు

image

AP: Eng, Agri తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET ఇతర పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని APSCHE స్పష్టం చేసింది. CETలపై ఇవాళ కన్వీనర్లతో సమీక్షించి షెడ్యూల్ జారీ చేసింది. EAPCET-Eng మే 12-15, 18, Agri& phm మే 19, 20 తేదీల్లో జరుగుతాయి. ECET APR 23, PGECET APR 28-30, ICET మే 2, లాసెట్ మే4, EDCET మే 8, PGCET మే 8-11తేదీల్లో జరుగుతాయి.PGCET 3, ఇతర సెట్లన్నీ 2 షిఫ్ట్‌లలో ఉంటాయి.