News December 13, 2024
గుకేశ్‌కు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన స్టాలిన్
వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజును తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందించారు. అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలవడంతో ఆయనకు రూ.5 కోట్లతో ప్రభుత్వం సత్కరిస్తుందని స్టాలిన్ ట్వీట్ చేశారు. ‘మీ విశేషమైన విజయం భారతదేశ చెస్ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. దీంతో చెన్నై ప్రపంచ చెస్ క్యాపిటల్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. తమిళనాడు మిమ్మల్ని చూసి గర్విస్తోంది’ అని పేర్కొన్నారు.
Similar News
News January 20, 2025
నూతన అధ్యక్షుడు తొలుత చేసే సంతకాలు ఇవే…!
అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ ఎన్నికల హామీలపై ఫోకస్ చేయనున్నట్లు సమాచారం. మెక్సికోతో ఉన్న సరిహద్దును మూసివేయడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపడం, ఆర్మీలో ట్రాన్స్‌జెండర్ల నియామకానికి అడ్డుకట్ట వేయడంతో పాటు పలు కీలక ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.
News January 20, 2025
J&K ఎన్‌కౌంటర్: భారత జవాన్ వీరమరణం
J&Kలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీ జవాన్ పంగల కార్తీక్ వీరమరణం పొందారు. నార్త్ కశ్మీర్‌లోని జలూరా సోపోరాలో ఇవాళ ఇస్లామిస్ట్ తీవ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో కార్తీక్ తీవ్రగాయాలపాలవడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరికొందరు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.
News January 20, 2025
ట్రంప్ మంచి మాట చెప్పావ్: పుతిన్
మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిలువరిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతిచ్చారు. ‘ట్రంప్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నా. రష్యాతో నేరుగా సంబంధాలు పెట్టుకుంటానని ట్రంప్ చెప్పడం మంచిదే. అమెరికా కొత్త పాలకవర్గంతో చర్చలు జరుపుతాం’ అని పుతిన్ వ్యాఖ్యానించారు. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పశ్చిమాసియాలో యుద్ధాలను ఆపుతానని ట్రంప్ నిన్న చెప్పారు.