News January 29, 2025
అరకొర ఏర్పాట్లు, వీఐపీ కల్చర్ వల్లే తొక్కిసలాట: ఖర్గే

మహా కుంభమేళా సందర్భంగా పదుల సంఖ్యలో భక్తులు తొక్కిసలాటలో మృతి చెందడంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విచారం వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం అరకొర ఏర్పాట్లు చేయడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. వీఐపీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కుంభమేళా ఏర్పాట్లపై ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకోవడం కూడా తొక్కిసలాటకు కారణమని పేర్కొన్నారు.
Similar News
News February 12, 2025
టాయిలెట్‌లోకి ఫోన్ తీసుకెళ్తే..

టాయిలెట్లలో ఫోన్ వాడటం శారీరకంగా, మానసికంగా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల విసర్జన అవయవాలపై ఒత్తిడి పడుతుందని, రక్త ప్రసరణ నెమ్మదిస్తుందని తెలిపారు. రక్తనాళాలు ఉబ్బి పైల్స్, ఫిషర్స్‌కు దారి తీస్తుంది. టాయిలెట్‌లోని ప్రమాదకర బ్యాక్టీరియాలు, క్రిములు స్క్రీన్‌పై చేరి అతిసారం, కడుపు నొప్పి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లాంటి సమస్యలు వస్తాయి.
Share it
News February 12, 2025
శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,192 మంది భక్తులు దర్శించుకోగా 20,825 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు సమకూరింది.
News February 12, 2025
రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు

AP: రైతులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. భూములు రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో గతంలో ఇచ్చిన పాసు పుస్తకాలను వెనక్కి తీసుకొని ‘ఆంధ్రప్రదేశ్ రాజముద్ర’ ఉన్న వాటిని ఇవ్వనున్నారు. పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఉండటంతో రైతులు తిరస్కరిస్తున్నారని మంత్రి అనగాని CM చంద్రబాబుకు తెలిపారు. అలాగే సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు, పేర్లు కూడా మార్చి నాటికి తొలగిస్తామన్నారు.