News March 14, 2025

స్టార్ క్రికెటర్ కూతురు మృతి

image

అఫ్గానిస్థాన్ స్టార్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండేళ్ల కూతురు మరణించినట్లు అఫ్గాన్ జట్టు ఆటగాడు కరీం జనత్ ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. చిన్నారి ఫొటోను షేర్ చేశారు. అయితే ఆమె ఎలా మరణించిందనేది తెలియరాలేదు. స్టార్ హిట్టర్‌గా పేరొందిన జజాయ్ T20ల్లో 6 బంతులకు 6 సిక్సర్లు బాదడం, ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(12 బంతుల్లో) చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరారు.

Similar News

News March 14, 2025

రేపటి నుంచి ఒంటిపూట అంగన్వాడీ కేంద్రాలు

image

TG: అంగన్వాడీ కేంద్రాలను రేపటి నుంచి ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎండల తీవ్రత పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కేంద్రాలు నిర్వహించాలని ఉత్తర్వులిచ్చింది. అటు పాఠశాలలు కూడా రేపటి నుంచి ఒంటిపూట నడవనున్నాయి.

News March 14, 2025

రెండు రోజులు బ్యాంకులు బంద్!

image

ఈనెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA)తో జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో ఆ 2 రోజులు బ్యాంకులు బంద్ అయ్యే అవకాశం ఉంది. అన్ని క్యాడర్లలో నియామకాలు, వారంలో 5 రోజుల పని తదితర డిమాండ్ల సాధనకు UFBU సమ్మె చేస్తోంది.

News March 14, 2025

‘ఛావా’ కలెక్షన్ల ప్రభంజనం

image

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమా ఇప్పటివరకు రూ.550 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. హిందీలో 4 వారాల్లో రూ.540.38 కోట్లు, తెలుగులో తొలి వారంలో రూ.11.80 కోట్లు వసూలు చేసింది. హోలీ హాలిడే, వీకెండ్ కావడంతో ఈ మూడు రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. విక్కీ కౌశల్, రష్మిక నటించిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు.

error: Content is protected !!