News November 15, 2024

టాలీవుడ్‌లోకి స్టార్ డైరెక్టర్ కూతురు.. ఫస్ట్ లుక్ చూశారా?

image

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. <<14591707>>’భైరవం’ సినిమాలో<<>> వెన్నెల అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి విజయ్ కనకమేడల దర్శకుడు. ఇందులో సాయి శ్రీనివాస్‌కు ఆమె జంటగా నటిస్తున్నట్లు సమాచారం.

Similar News

News December 4, 2024

KCRకు రేవంత్ రెడ్డి సవాల్

image

KCR రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని సీఎం రేవంత్ విమర్శించారు. ‘మేం కట్టిన శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు 60 ఏళ్లు ఎలా ఉన్నాయో, నువ్వు కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో చూడ్డానికి రా. లెక్కలు తేలుద్దాం’ అని సవాల్ విసిరారు. కాళేశ్వరం నుంచి చుక్కనీళ్లు లేకపోయినా రికార్డు స్థాయిలో కోటి మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని సీఎం తెలిపారు.

News December 4, 2024

ఆ రోజు సెలవు ఇవ్వాలని వినతి

image

TG: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15న జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కమిటీ కోరింది. ఈమేరకు ఆ పార్టీ జాతీయ నేత బీఎల్ సంతోష్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. అటు రాష్ట్ర కాంగ్రెస్ గిరిజన నేతలు కూడా కేంద్రాన్ని ఇదే విషయమై డిమాండ్ చేశారు. కాగా గతేడాది ఫిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలీడే ఇచ్చిన విషయం తెలిసిందే.

News December 4, 2024

కేసీఆర్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు: CM

image

TG: ప్రజల ఆశీస్సులతోనే సామాన్యుడినైన తాను సీఎం అయ్యానని సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి యువ వికాసం సభలో అన్నారు. ‘తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ మొదట ఈ గడ్డపై నుంచే చెప్పారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా సోనియా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కేసీఆర్ పాలనలో గిట్టుబాటు ధర రాక రైతులు ఉరేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆయనకు మాత్రం ఎకరాకు రూ.కోటి ఆదాయం వచ్చింది’ అని విమర్శించారు.