News March 23, 2025

స్టార్ హీరో ఆత్మహత్య కేసు.. ట్రెండింగ్‌లో నటి

image

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును CBI <<15854658>>క్లోజ్<<>> చేయడం సంచలనంగా మారింది. అతడి మృతికి ప్రేయసి రియా చక్రబర్తే కారణమంటూ మొదటి నుంచీ ఆరోపణలున్నాయి. కానీ ఆమెకు క్లీన్‌చిట్ వచ్చింది. దీంతో సుశాంత్‌కు న్యాయం జరగలేదంటూ అతడి అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఈ కేసుతో నాలుగేళ్లు నరకం అనుభవించిన రియాకు న్యాయం జరిగిందని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆమె పేరు SMలో ట్రెండ్ అవుతోంది.

Similar News

News April 23, 2025

నేడే టెన్త్ ఫలితాలు.. ఇలా చేయండి

image

AP: ఇవాళ టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉ.10 గంటలకు విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్‌ను ప్రకటిస్తారు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా రిలీజ్ చేస్తారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన పరీక్షలకు 6.19 లక్షల మంది హాజరయ్యారు. Way2News యాప్ ద్వారా సులభంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో మార్కుల లిస్ట్ వస్తుంది.

News April 23, 2025

రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ మలిదశ విచారణ

image

కాళేశ్వరం కమిషన్ రెండోదశ విచారణ రేపటినుంచి ప్రారంభంకానుంది. ఈ సారి దర్యాప్తులో భాగంగా గత ప్రభుత్వంలోని బాధ్యులకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ నెలతో కమిషన్ గడువు ముగియనున్న నేపథ్యంలో మరో రెండు మాసాలు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటైంది.

News April 23, 2025

సత్యసాయి శత జయంతికి రూ.100 నాణెం

image

శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు వచ్చే ఏడాది నవంబర్ 23 నాటికి పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో రూ.100 నాణేన్ని విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 44mm చుట్టుకొలత, 35 గ్రాముల బరువు ఉండే ఈ నాణెంలో 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ ఉంటుంది. ఒకవైపు అశోక స్తంభం, మరోవైపు సత్యసాయిబాబా చిత్రం, 1926 నంబర్ ఉంటుంది.

error: Content is protected !!