News March 19, 2025

పెళ్లి చేసుకోనున్న స్టార్ హాకీ ప్లేయర్లు

image

భారత జాతీయ హాకీ జట్టు ప్లేయర్లు మన్దీప్ సింగ్, ఉదితా దుహాన్‌లు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. మైదానంలో తమ ప్రదర్శనతో దేశం మొత్తం గర్వపడేలా చేసిన ఈ జంట ఈనెల 21న పెళ్లి చేసుకోనున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇప్పటికే పెళ్లికి ముందు జరిగే తంతు ప్రారంభమైనట్లు తెలిపాయి. కరోనా సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహబంధం ప్రేమగా మారింది.

Similar News

News October 22, 2025

ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు ప్రజలెవరూ బయటికి రావొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

News October 22, 2025

మిరప సాగు – విత్తన మోతాదు, విత్తన శుద్ధి

image

వర్షాధారంగా మిరపను సాగు చేస్తారు. ఈ పంటకు నల్ల, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. మిరపకు మెత్తని దుక్కికావాలి. అందుకే నేలను 3-4 సార్లు దున్ని 2సార్లు గుంటక తోలాలి. విత్తనం ఎద బెట్టేందుకు ఎకరానికి 2.5KGల విత్తనం అవసరం. రసం పీల్చే పురుగుల నివారణకు కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌ను, తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 3గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధిచేయాలి.

News October 22, 2025

అధికారంలోకి రాగానే బల్క్ డ్రగ్‌ పార్కు రద్దు చేస్తాం: బొత్స

image

AP: అనకాపల్లి(D) రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న మత్స్యకారులకు అండగా ఉంటామని YCP MLC బొత్స సత్యనారాయణ అన్నారు. ‘ఆందోళన చేస్తున్న మత్స్యకారులు సంఘ విద్రోహ శక్తులా? వారిని ఎందుకు నిర్బంధిస్తున్నారు? వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్‌ పార్కును రద్దు చేస్తాం. త్వరలో జగన్ రాజయ్యపేటలో పర్యటిస్తారు’ అని స్పష్టం చేశారు.