News March 8, 2025
స్టార్ షిప్ ఎఫెక్ట్: 240కి పైగా విమానాలకు అంతరాయం

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ షిప్ నిన్న ఉదయం భూకక్ష్యలో ప్రవేశించే సమయంలో ముక్కలైపోయిన సంగతి తెలిసిందే. దాని శకలాలు ఫ్లోరిడా, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై పడ్డాయి. దీంతో తమ దేశవ్యాప్తంగా 240 విమానాల రాకపోకలు నిలిచిపోయాయని అమెరికా ఏవియేషన్ యంత్రాంగం తెలిసింది. మియామీ, ఫోర్ట్ లాడర్‌డేల్, ఓర్లాండో, పామ్ బీచ్ ఎయిర్ పోర్టులు ప్రధానంగా సమస్యల్ని ఎదుర్కొన్నాయని పేర్కొంది.
Similar News
News March 28, 2025
కలెక్షన్లలో ‘L2: ఎంపురాన్’ రికార్డు

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘L2: ఎంపురాన్’ దేశవ్యాప్తంగా తొలి రోజు ₹21కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దీంతో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇంతకముందు ఈ రికార్డు పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’ (₹8.95cr) పేరిట ఉండేది. ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా నిన్న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. మీరు ఈ మూవీ చూశారా? ఎలా ఉంది?
News March 28, 2025
చార్‌ధామ్ యాత్ర.. వీడియోలు, రీల్స్ చిత్రీకరణపై నిషేధం

ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర సందర్భంగా ఆలయాల ప్రాంగణంలో యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లపై నిషేధం ఉండనుంది. ఆలయ ప్రాంగణంలో వీడియోలు, రీల్స్ చేస్తూ ఎవరైనా దొరికితే వారికి దర్శనం నిరాకరించి తిరిగి పంపించేస్తామని కేదార్‌నాథ్-బద్రీనాథ్ పాండా సమాజ్ ప్రకటించింది. ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి తలుపులు, మే 2న కేదార్‌నాథ్, 4న బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి.
News March 28, 2025
అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు పెద్దవాడు: అంబటి

AP: అబద్ధాలు చెప్పడంలో CM చంద్రబాబు అందరికంటే పెద్దవారని, నిజాలు చెప్పడంలో చిన్న వారని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. ‘పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబే. ప్రాజెక్టు నిధులను జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది నిజమని నిరూపిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తా. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును మేమే కడతామని CBN ఎందుకు ఒప్పందం చేసుకున్నారు?’ అని ప్రశ్నించారు.