News January 12, 2025
యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు

AP: రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. BCలకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఇందులో సగం రాయితీ ఉంటుంది. జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రూ.8 లక్షలు ఇవ్వనుంది. ఇందులో రూ.4 లక్షలు రాయితీ ఇస్తారు. EBCలకు కూడా స్వయం ఉపాధి పథకాలు అందిస్తోంది. ఇందులోనూ 50 శాతం రాయితీ ఇస్తోంది. MPDO ఆఫీస్‌లో అప్లై చేసుకోవాలి.
Similar News
News February 14, 2025
స్టీల్‌ప్లాంట్‌ను లాభాల్లోకి తెచ్చేందుకు కృషి: శ్రీనివాస వర్మ

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ పునరుద్ఘాటించారు. కొన్ని కారణాల వల్ల ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని, దాన్ని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.11,400కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇచ్చిందని గుర్తుచేశారు. CM CBN, మంత్రి లోకేశ్ కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. స్టీల్‌ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
News February 14, 2025
ఘోరం: యువకుడిని చంపి ముక్కలుగా చేసి..

AP: రాష్ట్రంలో మరో దారుణ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లా కంభంలో శ్యాంబాబు(30) అనే యువకుడిని దుండగులు ఘోరంగా హత్య చేశారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి వాటిని బస్తాల్లో కుక్కి నక్కలగండి పంట కాలువలో పడేశారు. ఈ హత్య వెనుక సమీప బంధువులే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 14, 2025
Good News: హోల్‌సేల్ రేట్లు తగ్గాయ్..

భారత టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) జనవరిలో 2.31 శాతానికి తగ్గింది. 2024 డిసెంబర్లో ఇది 2.37%. గత ఏడాది జనవరిలో ఇది 0.27 శాతమే కావడం గమనార్హం. ఆహార వస్తువుల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. ఫుడ్ ప్రొడక్ట్స్, టెక్స్‌టైల్స్ తయారీ, క్రూడ్ పెట్రోల్, గ్యాస్ ధరలు మాత్రం పెరుగుతున్నట్టు పేర్కొంది. డిసెంబర్లో 8.89గా ఉన్న WPI ఫుడ్ ఇండెక్స్ విలువ జనవరిలో 7.47కు దిగొచ్చిందని తెలిపింది.