News July 13, 2024
30 రోజుల్లో రాష్ట్రం రావణకాష్ఠం: YCP

AP: సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం నెలలో 30 కార్యక్రమాలు <<13615395>>చేపట్టినట్లు<<>> టీడీపీ చేసిన ట్వీట్‌పై వైసీపీ కౌంటర్ ఇచ్చింది. 30 రోజుల్లో రాష్ట్రం రావణకాష్ఠమైందని మండిపడింది. ‘అనకాపల్లిలో ఇద్దరు మహిళలపై దాడి, 9వ తరగతి బాలిక హత్య, టీడీపీ అక్రమ కేసులతో కళ్యాణదుర్గంలో తల్లీకూతుళ్ల ఆత్మహత్య, ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల బాలికపై హత్యాచారం, డెక్కన్ క్రానికల్ ఆఫీసుపై దాడి’ తదితర 30 ఘటనలను పోస్టు చేసింది.
Similar News
News December 9, 2025
హైదరాబాద్‌లోని NI-MSMEలో ఉద్యోగాలు..

HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్(NI-<
News December 9, 2025
శోకం నుంచి శక్తిగా.. సోనియా ప్రస్థానం!

నేడు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు. భర్త రాజీవ్ గాంధీ మరణంతో పార్టీ పగ్గాలు చేపట్టి పురుషుల ఆధిపత్యం ఉన్న రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న పార్టీని అకుంఠిత దీక్షతో మళ్లీ అధికారంలోకి తెచ్చారు. పాలనలో తనదైన ముద్ర వేసి సుదీర్ఘకాలం దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. 2009లో ఇదే రోజున తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ ఆమె రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించారు.
News December 9, 2025
మేకప్ లేకుండా అందంగా ఉండాలంటే!

అందంగా కనిపించాలని అమ్మాయిలు ఖరీదైన ఉత్పత్తులు వాడుతుంటారు. ఇలా కాకుండా కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే సహజంగానే మెరిసిపోవచ్చంటున్నారు నిపుణులు. హెల్తీ ఫుడ్, తగినంత నిద్ర, మంచినీళ్లు తాగడం, సంతోషంగా ఉండటం వల్ల సహజంగా అందం పెరుగుతుందంటున్నారు. దీంతో పాటు బేసిక్ స్కిన్ కేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనికోసం నాణ్యమైన మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడాలని చెబుతున్నారు.


