News December 15, 2024
YCP హయాంలో రాష్ట్రం తిరోగమనం: చంద్రబాబు
AP: ప్రజలకు మంచి చేసే వ్యక్తులను, చెడు చేసే వ్యక్తులను గుర్తుంచుకోవాలని CM చంద్రబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవంలో CM మాట్లాడారు. ‘2019-24 మధ్య రాష్ట్రాన్ని YCP నిర్వీర్యం చేసింది. అమరావతి, పోలవరాన్ని నాశనం చేసింది. ప్రజల నెత్తిన చెయ్యి పెట్టి ఆస్తులు రాయించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ ఐదేళ్లు ప్రజలకు స్వేచ్ఛ లేదు. కానీ ప్రజలను హ్యాపీగా ఉంచడమే మా ధ్యేయం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 23, 2025
ఆరు నెలల వరకు బంగారం కొనలేమా…
ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో 6 నెలల వరకు బంగారం రేట్లు అస్థిరంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు అధిక ధరలు కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంటున్నారు. ఇన్వెస్టర్లకు మాత్రం ఉపయోగకరమేనని అంటున్నారు. ఓపెన్ మార్కెట్లో 24k గోల్డ్ 10gr ధర రూ.82వేలు దాటేసింది. ఇండియన్ బులియన్, జువెలరీ అసోసియేషన్ (IBJA) ప్రకారం తొలిసారి రూ.80,194 దాటింది. 2024, OCT 30నాటి రూ.79,681ని దాటేసింది.
News January 23, 2025
ట్రంప్ తగ్గేదే లే
అధికారంలోకి వచ్చిన తొలిరోజే US దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించిన ట్రంప్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ వలసదారులు స్కూళ్లు, చర్చిలు, ఆస్పత్రులు, పెళ్లిళ్లు, దహన సంస్కారాలు లాంటి సున్నిత ప్రాంతాల్లో ఉన్నా అరెస్టు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 2011లోని నిబంధనను ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎత్తివేసింది. క్రిమినల్స్ ఎక్కడ దాక్కున్నా వదలబోమంది.
News January 23, 2025
ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన
TG: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో పలు సంస్థలతో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో సుమారు 49,550 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశముంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల్లో ఇదే రికార్డు కాగా గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు మించాయి. కాగా రేపు ఉదయం సీఎం రేవంత్ బృందం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనుంది.