News January 31, 2025
రాష్ట్ర ఆదాయం పడిపోయింది: KCR
తెలంగాణ ఆదాయం భారీగా పడిపోయిందని మాజీ CM KCR సంచలన ఆరోపణలు చేశారు. ₹13వేల కోట్ల ఆదాయం తగ్గిందని కాగ్ స్పష్టం చేసిందన్నారు. రానురాను పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయని, మరో 4 నెలలైతే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. మాట్లాడితే తనను ఉద్దేశించి ఫామ్హౌస్ అంటుండటంపై స్పందించిన KCR.. ‘ఇక్కడ అల్లం, ఉల్లిపాయ తప్ప ఏమున్నాయి? వాళ్లు వస్తే పార ఇచ్చి తవ్వుకోమందాం’ అని ఎద్దేవా చేశారు.
Similar News
News January 31, 2025
మొగిలిగిద్ద ZPHSకు రూ.10 కోట్లు మంజూరు
TG: RR(D) ఫరూక్నగర్(మ) మొగిలిగిద్ద ZPHS స్కూలు 150వ వార్షికోత్సవంలో పాల్గొన్న CM రేవంత్ రెడ్డి పాఠశాలపై వరాల జల్లు కురిపించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేశారు. పాఠశాల నూతన భవనం, గ్రంథాలయ భవన నిర్మాణాలకు రూ.10 కోట్లు, గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాల కోసం రూ.5 కోట్లు, పంచాయతీ కార్యాలయం కోసం రూ.50లక్షలు, జూనియర్ కాలేజీలో మౌలిక సదుపాయాలకు రూ.50లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
News January 31, 2025
టాస్ గెలిచిన ఇంగ్లండ్
నాలుగో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. పుణేలో జరుగుతున్న ఈ మ్యాచ్లో మూడు మార్పులతో ఇండియా బరిలోకి దిగుతోంది. షమీ స్థానంలో అర్ష్దీప్, జురెల్ స్థానంలో రింకూ సింగ్, సుందర్ స్థానంలో శివమ్ దూబే ఆడనున్నారు.
జట్టు: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
News January 31, 2025
గిరిజన బిడ్డను ‘రాయల్ ఫ్యామిలీ’ అవమానించింది: మోదీ
రాష్ట్రపతిపై ‘పూర్ థింగ్’ కామెంట్స్ చేసిన సోనియా గాంధీపై PM మోదీ విరుచుకుపడ్డారు. గిరిజన బిడ్డను ‘రాయల్ ఫ్యామిలీ’ అవమానించిందన్నారు.. ‘ఆ ఫ్యామిలీలో ఒకరు ఆమెది బోరింగ్ స్పీచ్ అన్నారు. మరొకరు రాష్ట్రపతి పూర్ థింగ్ అని అవమానించారు. ఇది 10కోట్ల మంది గిరిజనులను, దేశంలోని ప్రతి పేదవాడిని కించపరచడమే’ అని మండిపడ్డారు. ముర్ము మాతృభాష హిందీ కాకపోయినా ఇవాళ లోక్సభలో అద్భుతంగా ప్రసంగించారని PM కొనియాడారు.