News October 29, 2024
జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా: సీఎం ఒమర్
జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్రహోదా వస్తుందని సీఎం ఒమర్ అబ్దుల్లా ధీమా వ్యక్తం చేశారు. తన ఢిల్లీ పర్యటనలో ఈ విషయంలో హామీ లభించిందన్నారు. ‘యూటీ హోదా తాత్కాలికమే. జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్రహోదా వస్తుంది. అత్యున్నత స్థాయిలో నాకు హామీ లభించింది’ అని స్పష్టం చేశారు. వచ్చే నెలలో మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు ముగిసిన తర్వాత కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై కేంద్రం ఓ నిర్ణయానికి రావొచ్చని సమాచారం.
Similar News
News October 30, 2024
మెట్రో రెండో దశలో డ్రైవర్ రహిత కోచ్‌లు
TG: HYD రెండో దశ మెట్రో ప్రాజెక్టులో అత్యాధునిక విధానాలు అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రైవర్ రహిత ఫోర్త్ జనరేషన్ కోచ్‌లను ప్రతిపాదించింది. ప్లాట్‌ఫామ్‌లపై స్క్రీన్ డోర్లు, స్టేషన్ల వద్ద ఎకరం విస్తీర్ణంలో పార్కింగ్, ప్రతి కారిడార్‌కు ఒక డిపో ఉండేలా నిర్దేశించింది. రెండో దశలో 5 కారిడార్లలో ₹24,269Cr వ్యయంతో 76.4KM మేర <<14462321>>మెట్రో<<>> మార్గానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News October 30, 2024
ఏపీలో ఓటర్లు 4.14 కోట్లు
AP: రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 4,14,20,395కు చేరింది. ఇందులో పురుషులు 2,03,47,738, మహిళలు 2,10,69,803, థర్డ్ జెండర్ 3,394 మంది ఉన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను విడుదల చేసింది. జనవరి నుంచి కొత్తగా 10,82,841 మంది ఓటర్లు చేరారు. నవంబర్ 9, 10, 23, 24 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరించి, వచ్చే జనవరి 6న తుది జాబితాను ఈసీ ప్రచురించనుంది.
News October 30, 2024
KKR రిటెన్షన్స్ ఆ ఆటగాళ్లే కావొచ్చు: భజ్జీ
ఈ ఏడాది ఐపీఎల్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు రిటెన్షన్స్ చాలా కష్టమని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఎవర్ని అట్టిపెట్టుకోవాలన్నది నిర్ణయించుకోవడం ఇబ్బందేనని పేర్కొన్నారు. ‘సీజన్ అంతా అద్భుతంగా ఆడిన KKRకి కొంతమందినే రిటెయిన్ చేసుకోవడం ఈజీ కాదు. కానీ నా దృష్టిలో శ్రేయస్, ఫిల్ సాల్ట్, నరైన్, రస్సెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్‌ను ఆ జట్టు కొనసాగిస్తుంది’ అని అంచనా వేశారు.