News November 22, 2024
డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్
TG: తమ డిమాండ్ల సాధనకు డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌తో పాటు HYDలో లక్ష మందితో భారీ ర్యాలీ, సభ నిర్వహిస్తామని రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ ప్రకటించింది. HYDలో 20వేల కొత్త ఆటోలకు పర్మిట్ ఇవ్వాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెల్లించి, యాక్సిడెంట్ బీమాను రూ.10లక్షలకు పెంచాలని డిమాండ్ చేసింది. ఒక్కో ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ.12వేల ఆర్థిక సాయం పథకాన్ని వెంటనే అమలు చేయాలని పేర్కొంది.
Similar News
News December 2, 2024
విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే?
ప్రత్యేక పరిస్థితుల్లో అంతర్జాతీయంగా <<14769455>>ముడిచమురు<<>> ధరలు పెరిగితే ఇంధన కంపెనీలకు భారీ లాభాలు వస్తుంటాయి. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్, ATF, క్రూడ్ ఉత్పత్తులపై విధించే అత్యధిక పన్నునే ‘విండ్ ఫాల్ ట్యాక్స్’ అంటారు. 2022 జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది. కొంతకాలంగా పన్ను రద్దు చేసేందుకు కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఇవాళ రద్దు చేసింది.
News December 2, 2024
శిండేకు అనారోగ్యం.. ఢిల్లీకి అజిత్ పవార్
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తున్నా మహాయుతిలో పదవుల పంపకం కొలిక్కిరావడం లేదు. కీలక శాఖల కోసం శివసేన, NCP పట్టుబడుతున్నాయి. శాఖల కేటాయింపు తేలకపోవడంతోనే CM అభ్యర్థి ప్రకటనను బీజేపీ వాయిదా వేస్తోంది. దీనిపై సోమవారం జరగాల్సిన మహాయుతి నేతల సమావేశం శిండే అనారోగ్యం వల్ల వాయిదా పడినట్టు తెలిసింది. మరోవైపు కోరిన శాఖల్ని దక్కించుకొనేందుకు అజిత్ పవార్ మళ్లీ ఢిల్లీకి పయనమయ్యారు.
News December 2, 2024
మోస్ట్ డిజాస్టర్ మూవీగా ‘కంగువ’!
తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘కంగువ’ థియేట్రికల్ రన్ పూర్తయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ భారీ బడ్జెట్ చిత్రం రూ.130 కోట్ల నష్టంతో ఆల్‌టైమ్ డిజాస్టర్‌గా నిలిచినట్లు వెల్లడించాయి. ఇప్పటివరకు ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా పేరిట ఈ చెత్త రికార్డు ఉండేది. ఈ మూవీ రూ.120 కోట్లు నష్టపోయింది. కాగా మరికొన్ని రోజుల్లో ‘కంగువ’ OTTలోకి రానుంది.