News November 17, 2024

ట్రంప్ దిగిపోయేవరకూ మా నౌకలో ఉండండి.. సంస్థ ఆఫర్!

image

అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే దేశం వదిలి వెళ్లిపోతామంటూ USలో చాలామంది ప్రముఖులు ఎన్నికలప్పుడు అన్నారు. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాకు చెందిన ఫార్చూన్ అనే ఓ క్రూయిజ్ షిప్ సంస్థ దీన్ని వ్యాపారావకాశంగా మలచుకుంది. ట్రంప్ పదవీకాలం ముగిసేవరకూ తమ క్రూయిజ్ షిప్‌లో ప్రపంచమంతా తిరగమని ఆఫర్ ఇచ్చింది. ఏడాదికి 40వేల డాలర్లు చెల్లిస్తే చాలని పేర్కొంది. మరి ఈ ఆఫర్‌ను ఎంతమంది తీసుకుంటారో చూడాలి.

Similar News

News December 13, 2024

బాబోయ్.. ఇదేం చలి!

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలను చలి వణికిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 7°C నమోదైంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 9 వరకు చలి ప్రభావం ఉంటుండగా వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికి తోడు పొగమంచు కారణంగా వాహనదారులు లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు.

News December 13, 2024

పెదవుల పగుళ్లను నివారించండిలా!

image

చలికాలంలో ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య పెదవుల పగుళ్లు. రాత్రి పడుకునే ముందు పాలతో పెదవులను మర్దన చేసుకొని మార్నింగ్ లేవగానే కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కొబ్బరి నూనె, ఆ నూనెతో తయారు చేసిన లిప్ బామ్స్ కూడా పగుళ్లను నివారిస్తాయి. తేనె కూడా పెదవుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రాత్రి పూట రాసి ఉదయాన్నే కడిగితే పెదవులు మృదువుగా మారిపోతాయి. వీటితో పాటు తగినంత నీటిని తాగడం ముఖ్యం.

News December 13, 2024

పాకిస్థాన్ క్రికెట్ టెస్ట్ జట్టు కోచ్ రాజీనామా

image

పాక్ క్రికెట్ టెస్ట్ జట్టు కోచ్ గిలెస్పీ రాజీనామా చేశారని క్రిక్‌బజ్ తెలిపింది. కొద్ది‌గంటల్లో పాక్ జట్టు సౌతాఫ్రికాకు టెస్ట్ సిరీస్‌ కోసం వెళ్లాల్సి ఉండగా ఆయన పాక్ క్రికెట్ బోర్డ్(PCB)కి ఈ విషయం తెలియజేసినట్లు పేర్కొంది. ‘గిలెస్పీ రాజీనామా చేశారు’ అని PCB అధికార ప్రతినిధి ఒకరు చెప్పారని వివరించింది. దీంతో వన్డే జట్టు తాత్కాలిక కోచ్‌ ఆకిబ్ జావెద్‌నే టెస్టు జట్టుకూ తాత్కాలికంగా PCB నియమించింది.