News October 31, 2024
అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్?
AP: అనకాపల్లి(D) నక్కపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. మొదటి దశలో రూ.70K కోట్ల పెట్టుబడి పెడతామని ప్రభుత్వానికి ప్రతిపాదన అందించినట్లు తెలుస్తోంది. ప్లాంట్ నిర్మాణానికి 2వేల ఎకరాలు అవసరమని, 2029 నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తామని పేర్కొన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇది పూర్తయితే 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
Similar News
News November 10, 2024
దక్షిణాప్రికా, భారత్ రెండో టీ20కి వర్షం ముప్పు
సౌతాఫ్రికా, భారత్ మధ్య గెబేహా వేదికగా రాత్రి 7.30గం.లకు జరిగే రెండో T20 మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉంది. టాస్‌కు సైతం ఇబ్బంది కలిగే అవకాశముంది. వర్షం కారణంగా ఆటను పూర్తిగా కొనసాగించలేని పరిస్థితి ఎదురైతే, 5 ఓవర్లకు కుదించి మ్యాచ్ ఆడిస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్‌ను రద్దు చేస్తారు. ఇప్పటికే భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ రద్దయితే మిగతా 2 మ్యాచుల్లో ఒకటి గెలిచినా సిరీస్ మనదే అవుతుంది.
News November 10, 2024
CJI చంద్రచూడ్ చెప్పిన ఆ ప్రైవేటు ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఏంటి?
రాజకీయ నాయకులే కాదు ప్రైవేటు ఇంట్రెస్ట్ గ్రూప్స్ నుంచీ జడ్జిలపై ఒత్తిడి ఉంటుందని CJI చంద్రచూడ్ రిటైర్మెంట్ స్పీచ్‌లో చెప్పారు. మీడియా, సోషల్ మీడియాతో జడ్జిపై ప్రెజర్ పెట్టి కేసును ఒక దిశగా నడిపించేందుకు ప్రయత్నిస్తారన్నారు. అయితే ఆ ప్రైవేటు ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఏవన్న దానిపై నెట్టింట చర్చ జరుగుతోంది. లెఫ్ట్, రైట్ వింగ్స్, ఫారిన్ లాబీయింగ్, సొరోస్ స్పాన్సర్డ్ NGOs అని కొందరి వాదన. మరి మీరేమంటారు?
News November 10, 2024
సర్వేలో పాల్గొనండి.. పథకాల్లో కోత ఉండదు: మంత్రి పొన్నం
TG: రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్‌లో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ సమాచారం అంతా గోప్యంగా ఉంటుందని, సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్యుమరేటర్లకు ఇబ్బంది కలిగించడం సరికాదన్నారు. ఈ సర్వే తర్వాత సంక్షేమ పథకాల్లో కోత ఉండదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు.