News June 22, 2024
అమరావతిలో ముళ్ల కంపల తొలగింపునకు చర్యలు: మంత్రి
AP: అమరావతి ప్రాంతంలో ముళ్ల కంపలను తొలగించేందుకు టెండర్లు పిలుస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు వీటిని వెంటనే తొలగించాలని ఆదేశాలిచ్చారని చెప్పారు. 217 చదరపు కిలోమీటర్లలో మెజార్టీ ఏరియా అడవిలా తయారైందని చెప్పారు. ముళ్ల కంపలను తొలగించిన తర్వాత ఎంత మేర నష్టం జరిగిందనే దానిపై అంచనాకు వస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత పనులను ప్రారంభిస్తామన్నారు.
Similar News
News November 4, 2024
మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ నంబర్-1
AP: చెరువుల్లో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే టాప్‌లో నిలిచినట్లు కేంద్ర గణాంక శాఖ నివేదికలో వెల్లడైంది. జాతీయ స్థాయిలో ఏపీ వాటా 2011-12లో 17.7 శాతం ఉండగా, 2022-23 నాటికి 40.9 శాతానికి పెరిగింది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగాల్(14.4%), ఒడిశా(4.9%), బిహార్(4.5%), అస్సాం(4.1%) ఉన్నాయి. ఇక పశువుల ఉత్పత్తిలో ఏపీ ఫోర్త్, ఉద్యాన ఉత్పత్తుల్లో ఐదో స్థానంలో నిలిచింది.
News November 4, 2024
రేపు ఆవర్తనం.. విస్తారంగా వర్షాలు
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడి రాయలసీమ, దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. గత నెలలో 3 అల్పపీడనాల కారణంగా సాధారణం కంటే అధిక వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
News November 4, 2024
విశాఖ స్టీల్‌కు రూ.1650 కోట్ల సాయం
AP: ఆర్థిక, నిర్వహణ సవాళ్లతో ఇబ్బందిపడుతున్న విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.1650 కోట్ల సాయం అందించింది. సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 19న ఈక్విటీ కింద రూ.500 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద రూ.1150 కోట్లు అందించినట్లు వివరించింది. సంస్థ సుస్థిరంగా నిలదొక్కుకునేలా SBI ఆధ్వర్యంలో ఒక నివేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.