News September 2, 2024

రేపు ఉదయానికి రైళ్లు నడిపేలా చర్యలు: SCR జీఎం

image

TG: మహబూబాబాద్‌లో ధ్వంసమైన <<13990198>>రైల్వేట్రాక్<<>> మరమ్మతులు ఇవాళ సాయంత్రం కల్లా పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు. పనులకు వరద ప్రవాహం ఆటంకం కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు. రేపు ఉదయం కల్లా రైళ్లు నడిపేలా చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వెల్లడించారు. కాగా మరమ్మతు పనుల్లో 500 మంది రైల్వే సిబ్బంది, కార్మికులు పాల్గొనగా 15 మంది సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News September 19, 2024

ఒకప్పుడు టమాటాను విషం అనుకునేవారు!

image

పలు పాశ్చాత్య దేశాల్లో ఒకప్పుడు టమాటాను విషంగా భావించి భయపడేవారు. అవి తినడం వల్ల చాలామంది కన్నుమూయడమే అందుక్కారణం. మరణ భయంతో దానికి పాయిజన్ యాపిల్ అని పేరు కూడా పెట్టారు. సుమారు 200 ఏళ్ల పాటు ఈ నమ్మకమే ఉండేది. అయితే, ప్రజలు వాడుతున్న ప్యూటర్(pewter) ప్లేట్లలో లెడ్ సారం ప్రమాదకర స్థాయుల్లో ఉంటోందని, టమాటాల్లోని ఆమ్లంతో కలిసి వారి మరణాలకు దారి తీస్తోందని తర్వాత గుర్తించారు.

News September 19, 2024

అఫ్గానిస్థాన్ సంచలనం

image

వన్డే క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. దక్షిణాఫ్రికాపై తొలి సారి విజయం సాధించింది. యూఏఈలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచి అఫ్గాన్ రికార్డు సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్.. అఫ్గాన్ బౌలర్ల ధాటికి 106 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 107 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ 26 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

News September 19, 2024

నేను త్వరగా రిటైర్ అయ్యానేమో: ఫెదరర్

image

తాను త్వరగా రిటైర్ అయిపోయానని తనకు తరచూ అనిపిస్తుంటుందని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. టెన్నిస్ కోర్టుకు వచ్చినప్పుడల్లా తాను ఇంకా ఆడగలనని అనుకుంటానని పేర్కొన్నారు. ‘నాలో ఇంకా ఆట ఉంది. కానీ ఇంట్లో ఉండటం సౌకర్యంగా ఉంది. టూర్లు తిరగనవసరం లేదన్న విషయం గుర్తొచ్చినప్పుడు రిలీఫ్‌గా ఉంటుంది’ అని వెల్లడించారు. తన తోటి దిగ్గజం నాదల్ రిటైర్మెంట్‌పై అంచనా వేయలేనని స్పష్టం చేశారు.