News May 10, 2024
ఐఫోన్ల మేకింగ్ స్టీవ్ జాబ్స్‌కు ఇష్టం లేదట!

ఐఫోన్లకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. కొత్త ప్రొడక్ట్ వస్తే కొనడానికి టెక్ ప్రియులు రెడీగా ఉంటారు. అలాంటి ఐఫోన్‌ను తయారుచేయడం కంపెనీ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్‌కు తొలుత ఇష్టం లేదట. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఇంతలా అభివృద్ధి చెందుతుందని ఆయన ఊహించలేదని ప్రముఖ జర్నలిస్టు బ్రియాన్ మర్చంట్ వెల్లడించారు.‘ది వన్ డివైస్: ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ది ఐఫోన్’ పుస్తకంలో ఇలాంటి ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.
Similar News
News February 8, 2025
అలాంటి ఇంటి పట్టాల రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: YCP హయాంలో ఇంటి పట్టాలు పొందిన అనర్హులను గుర్తించి రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. లబ్ధిదారులకు కారు ఉందా? కుటుంబంలో ఎక్కువ మంది పట్టాలు పొందారా? తదితర వివరాలు సేకరించాలని పేర్కొంది. కాగా జగన్ ప్రభుత్వంలో 22.80L మందికి ఇంటిస్థలాలు ఇచ్చారు. వీరిలో 15.71L మందికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. మిగిలిన 7L మందిలోనే అనర్హులు ఉన్నట్లు సమాచారం.
News February 8, 2025
ఆప్‌కు కాంగ్రెస్ ‘ఓట్ షేరింగ్’ దెబ్బ

ఢిల్లీ ఎన్నికలు ఫలితాలు ఆప్‌కు అధికారాన్ని దూరం చేసేలా కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి దక్కాల్సిన ఓట్లను కాంగ్రెస్ పార్టీ దారుణంగా చీల్చడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఆప్ ప్రస్తుతం 15% ఓట్లు కోల్పోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 4.26 % ఓట్లు రాగా, ప్రస్తుతం 17% ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. ఆప్‌కు దక్కాల్సిన మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ ఎగరేసుకుపోయింది.
News February 8, 2025
ఆప్‌కు బిగ్ షాక్

అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడదామనుకున్న ఆప్‌కు ఫలితాల్లో ఎదురుగాలి వీస్తోంది. BJP 42 చోట్ల లీడింగ్‌లో ఉండగా ఆ పార్టీ కేవలం 25 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకంటే ముఖ్యంగా ఆప్ అగ్రనేతలు వెనుకంజలో ఉండటం పార్టీ శ్రేణులను షాక్‌కు గురి చేస్తోంది. కేజ్రీవాల్, ఆతిశీ, మనీశ్ సిసోడియా, ఇమ్రాన్ హుస్సేన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వెనుకంజలోనే కొనసాగుతున్నారు.