News December 4, 2024
ఇంకా 1,87,473 ఉద్యోగాలు బాకీ: KTR

TG: ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి భర్తీ చేసిన జాబ్స్ 12,527 మాత్రమేనని KTR ట్వీట్ చేశారు. నిరుద్యోగులకు ఇంకా 1,87,473 జాబ్స్ బాకీ ఉందని పేర్కొన్నారు. BRS ప్రభుత్వం ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లు పబ్లిసిటీ చేసుకుని, 55,143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులను మోసం చేస్తే కాంగ్రెస్‌కు అధోగతే అని అన్నారు.
Similar News
News February 15, 2026
ప్రభాస్‌కు గాయం!

సినీ హీరో ప్రభాస్ గాయపడినట్లు సమాచారం. ఫౌజీ సినిమా షూటింగ్‌లో హార్స్ రైడ్ చేస్తుండగా ఆయనకు గాయమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో ఇవాళ షూటింగ్‌కు బ్రేక్ తీసుకున్నారని, రేపట్నుంచి మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటారని టాక్. హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కీలకదశలో ఉంది. అటు సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్ సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీపైనే ఆశలు పెట్టుకున్నారు.
News February 15, 2026
శివుడిని లయకారుడు అని ఎందుకు అంటారు?

సృష్టి, స్థితి, లయ అనే 3 కార్యాలలో శివుడు ‘లయకారుడు’. అంటే ఈ విశ్వాన్ని ఉపసంహరించేవాడు అని అర్థం. అయితే ఈ లయం ప్రతికూలమైనది కాదు. పాతది అంతమైతేనే కొత్త సృష్టికి మార్గం సుగమమవుతుంది. శివుడు తన తాండవంతో అజ్ఞానం, అహంకారాన్ని లయం చేసి, ఆత్మను దైవంలో విలీనం చేస్తాడు. మనలో చెడు ఆలోచనలను నశింపజేసి, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఆయనను సృష్టి చక్రంలో మార్పును తెచ్చే పరమాత్మగా పూజిస్తారు.
News February 15, 2026
ప్రపంచంలోనే తొలి ఇంజినీరింగ్ కాలేజీ.. ఎక్కడో తెలుసా?

ఇంజినీరింగ్ విద్యకు ఎంతో క్రేజ్ ఉంది. దానికి తగ్గట్లే ఎన్నో వర్సిటీలు ప్రపంచవ్యాప్తంగా వెలిశాయి. ఈ విద్యకు 300 ఏళ్ల కిందటే నాంది పడింది. JAN 18, 1707న చెక్ రిపబ్లిక్ రాజధాని అయిన ప్రేగ్‌లో చెక్ టెక్నికల్ వర్సిటీని రోమన్ చక్రవర్తి జోసెఫ్-1 స్థాపించారు. ఇదే వరల్డ్స్ ఫస్ట్ ఇంజినీరింగ్ వర్సిటీ. సైనిక కోటలు, మౌలిక సదుపాయాల నిర్మాణాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవారు. క్రమంగా దీన్ని విస్తరించారు.


