News October 1, 2024
Stock Market: బజాజ్ ట్విన్స్ అదుర్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. నిన్నటి క్రాష్ నుంచి కాస్త కోలుకున్నాయి. BSE సెన్సెక్స్ 84,416 (+122), NSE నిఫ్టీ 25,829 (+18) వద్ద ట్రేడవుతున్నాయి. టెక్ మహీంద్రా, బజాజ్ ట్విన్స్, ఇన్ఫీ అదరగొడుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, టైటాన్, హిందాల్కో, JSW స్టీల్, సన్ ఫార్మా టాప్ లూజర్స్. IT, PSU బ్యాంక్, ఆటో, ఫైనాన్స్ రంగాల షేర్లకు గిరాకీ పెరిగింది. మెటల్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.
Similar News
News October 15, 2024
ఆటగాడిని కొట్టిన బంగ్లా హెడ్ కోచ్.. తొలగింపు!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ తమ హెడ్ కోచ్ చండికా హతురుసింఘాను సస్పెండ్ చేసింది. ఓ ఆటగాడిపై అతడు చేయి చేసుకోవడమే దీనిక్కారణంగా తెలుస్తోంది. 48 గంటల పాటు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని, ఆ తర్వాత అతడిని పూర్తిగా తప్పిస్తామని బీసీబీ వర్గాలు తెలిపాయి. అతడి స్థానంలో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఫిల్ సిమన్స్ బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వరకూ సిమన్సే కొనసాగుతారని పేర్కొన్నాయి.
News October 15, 2024
రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
AP: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపు చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు. అటు శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఈ నెల 17 వరకు సెలవులు ఇచ్చారు.
News October 15, 2024
పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు
AP: ‘పల్లె పండుగ’ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండటం ఆనందం కలిగిస్తోందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 13,326 గ్రామాలలో రూ.4,500 కోట్ల ఖర్చుతో 30 వేల అభివృద్ధి పనులు చేపట్టాలనే సంకల్పాన్ని డిప్యూటీ సీఎం పవన్ కార్యరూపంలోకి తీసుకువచ్చారని కొనియాడారు. ఇందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టి పల్లెల్లో సంతోషాలు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.