News November 28, 2024
Stock Market: బేర్స్ పంజా
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. Sensex 1,190 పాయింట్ల నష్టంతో 79,043 వద్ద, నిఫ్టీ 360 పాయింట్ల నష్టంతో 23,914 వద్ద స్థిరపడ్డాయి. ఐటీ 2.39%, ఆటో 1.63%, ఫైనాన్స్ సహా అధిక వెయిటేజీ రంగాలు నష్టాలబాటపట్టాయి. Adani Ent (1.63%), SBIN (0.77%), Shriram Fin (0.63%) టాప్ గెయినర్స్. Sbi Life (-5.41%), Hdfc Life (-3.74%), M&M (-3.35%), Infy (-3.34%) టాప్ లూజర్స్.
Similar News
News December 5, 2024
డిసెంబర్ 5: చరిత్రలో ఈ రోజు
* 1901: హాలీవుడ్ దర్శకుడు వాల్ట్ డిస్నీ జననం
* 1905: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం షేక్ అబ్దుల్లా జననం
* 1985: టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధవన్ జననం
* 1992: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ జననం
* 2013: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మరణం
* 2016: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం
* ప్రపంచ నేల దినోత్సవం .
News December 5, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 5, 2024
వ్యవసాయదారులకు మరిన్ని రుణాలు: నాబార్డ్
AP: రాష్ట్రంలో వ్యవసాయానికి మరిన్ని రుణాలు అందించేందుకు తమ సహకారం ఉంటుందని నాబార్డు ఛైర్మన్ షాజీ కృష్ణన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అమరావతిలో CM చంద్రబాబుతో కృష్ణన్ సమావేశమయ్యారు. ‘డ్వాక్రా గ్రూపులు, రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రయత్నిస్తాం. రాష్ట్రానికి FIDF కింద అదనపు నిధులు, కేటాయింపులు, రాయితీలు అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.