News August 22, 2024
Stock Market: లాభాలతో ఆరంభం

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రీమార్కెట్ సెషన్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 281 పాయింట్లు గ్యాప్అప్‌తో 81,187 వద్ద, నిఫ్టీ 97 పాయింట్లు లాభపడి 24,867 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో ఒడుదొడుకుల మధ్య స్వల్ప లాభాలతో ముగిసిన దేశీ సూచీలు, ఈ రోజు గిఫ్ట్ నిఫ్టీ ట్రెండ్స్‌తో బుల్ సెంటిమెంట్ బలపడినట్టు నిపుణులు చెబుతున్నారు.
Similar News
News November 9, 2025
‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అని యూట్యూబ్‌లో చూసి..

AP: దొంగా-పోలీస్ ఆడదామంటూ విశాఖలో అత్త కనకమహాలక్ష్మి(66)ని కోడలు లలిత చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అత్తను చంపే ముందు లలిత యూట్యూబ్‌లో ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అనే వీడియోలు చూసింది. తన తల్లి స్నానానికి వెళ్లగా, దాగుడు మూతల పేరిట పిల్లల్ని గదిలోకి పంపింది. అత్తను కట్టేసి పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఎదురింట్లో AC బిగిస్తున్న వ్యక్తి కనకమహాలక్ష్మిని కాపాడేందుకు రాగా లలిత అడ్డుకుంది.
News November 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్‌లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్‌లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.
News November 9, 2025
HCLలో 64 జూనియర్ మేనేజర్ పోస్టులు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<


