News September 23, 2024
Stock Market: బుల్ ర్యాలీ కొనసాగింది

స్టాక్ మార్కెట్లో బుల్ ర్యాలీ సోమవారం కూడా కొనసాగింది. సెన్సెక్స్ 384 పాయింట్ల లాభంతో 84,928 వద్ద, నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 25,939 వద్ద స్థిరపడ్డాయి. బజాజ్ ఆటో, M&M, ONGC, Hero Motocorp, Sbi Life టాప్ గెయినర్స్. ఐచర్, ICICI, Divis Lab, WIPRO టాప్ లూజర్స్. ఫెడ్ రేట్ల కోతతో అమెరికా మాంద్యం భయాలు తగ్గడం, విదేశీ పెట్టుబడులు పెరగడంతో దేశీయ మార్కెట్లలో సెంటిమెంట్ బలపడింది.
Similar News
News December 8, 2025
నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ(<
News December 8, 2025
‘హమాస్’పై ఇండియాకు ఇజ్రాయెల్ కీలక విజ్ఞప్తి

‘హమాస్’ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్‌ను ఇజ్రాయెల్ కోరింది. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, ఇరాన్ సంస్థలతో దీనికి సంబంధాలున్నాయని చెప్పింది. గాజాలో కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా దాడులకు అంతర్జాతీయ సంస్థలను వాడుకుంటోందని తెలిపింది. హమాస్ వల్ల ఇండియా, ఇజ్రాయెల్‌కు ముప్పు అని పేర్కొంది. ఇప్పటికే US, బ్రిటన్, కెనడా తదితర దేశాలు హమాస్‌ను టెర్రర్ సంస్థగా ప్రకటించాయి.
News December 8, 2025
తెలంగాణ అప్డేట్స్

* ఈ నెల 17 నుంచి 22 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది
* తొలిసారిగా SC గురుకులాల్లో మెకనైజ్డ్ సెంట్రల్ కిచెన్‌ను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
* రాష్ట్రంలోని హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, CHCల్లో మరో 79 డయాలసిస్ సెంటర్లు..
* టెన్త్ పరీక్షలకు విద్యార్థుల వివరాలను ఆన్లైన్ ద్వారా మాత్రమే సేకరించాలని స్పష్టం చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీహరి


