News September 23, 2024
Stock Market: బుల్ ర్యాలీ కొనసాగింది
స్టాక్ మార్కెట్‌లో బుల్ ర్యాలీ సోమవారం కూడా కొనసాగింది. సెన్సెక్స్ 384 పాయింట్ల లాభంతో 84,928 వద్ద, నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 25,939 వద్ద స్థిరపడ్డాయి. బజాజ్ ఆటో, M&M, ONGC, Hero Motocorp, Sbi Life టాప్ గెయినర్స్. ఐచర్, ICICI, Divis Lab, WIPRO టాప్ లూజర్స్. ఫెడ్ రేట్ల కోతతో అమెరికా మాంద్యం భయాలు తగ్గడం, విదేశీ పెట్టుబడులు పెరగడంతో దేశీయ మార్కెట్లలో సెంటిమెంట్ బలపడింది.
Similar News
News October 13, 2024
త్వరలో మరో పార్టీలో చేరుతా: రాపాక
AP: వైసీపీని వీడనున్నట్లు రాజోలు మాజీ ఎమ్మెల్యే <<14347126>>రాపాక<<>> వరప్రసాద్ తెలిపారు. వైసీపీలో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. ‘గతంలో పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నూరు శాతం నిర్వహించా. అయినా ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వలేదు. TDP నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు ఇచ్చారు. ఇప్పుడు ఆయననే ఇన్‌ఛార్జ్‌గానూ నియమించారు. ఇష్టం లేకపోయినా MPగా పోటీ చేశా. త్వరలో మరో పార్టీలో చేరుతా’ అని మీడియాకు వెల్లడించారు.
News October 13, 2024
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్!
ఈ దీపావళికి దేశీయ మార్గాల్లో విమాన టికెట్ల ధరలు సగటున 20-25% తగ్గినట్టు పలు సంస్థలు చెబుతున్నాయి. 30 రోజుల అడ్వాన్స్ బుకింగ్‌పై వన్ వేలో ఈ సగటు తగ్గింపు ధరలు వర్తిస్తున్నాయి. పెరిగిన విమానాల సంఖ్య, ఇంధన ధరల తగ్గింపు వల్ల ధరలు దిగొచ్చినట్టు అంచనా వేస్తున్నాయి. HYD-ఢిల్లీ మార్గాల్లో 32% ధరలు తగ్గినట్టు విశ్లేషిస్తున్నాయి. గత ఏడాది కంటే ధరలు తగ్గినట్టు సంస్థలు పేర్కొన్నాయి.
News October 13, 2024
బాబర్‌ను తప్పిస్తారా..? భారత్‌ను చూసి నేర్చుకోండి: పాక్ క్రికెటర్
ఇంగ్లండ్‌తో తర్వాతి రెండు టెస్టులకు బాబర్ ఆజమ్‌ను పాక్ క్రికెట్ బోర్డు తప్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆ దేశ ఆటగాడు ఫఖార్ జమాన్ ట్విటర్లో మండిపడ్డారు. ‘బాబర్‌ను తప్పించడమేంటి? 2020-23 మధ్యకాలంలో విరాట్ సగటు ఎంత తక్కువగా ఉన్నా భారత్ అతడిని తప్పించలేదు. మన దేశంలోనే అత్యుత్తమ బ్యాటరైన బాబర్‌ను తప్పించడం జట్టుకు తప్పుడు సంకేతాల్నిస్తుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.