News December 16, 2024

Stock Market: బుల్ సైలెంట్

image

Day Highని కూడా క్రాస్ చేయ్య‌లేక‌ దేశీయ సూచీలు Mon న‌ష్టాల‌బాట‌ప‌ట్టాయి. Sensex 384 పాయింట్ల లాస్‌తో 81,748 వ‌ద్ద, Nifty 100 పాయింట్లు కోల్పోయి 24,668 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. రియ‌ల్టీ రంగం 3% లాభ‌ప‌డింది. Media, Consumer Durables, ఫార్మా స్వ‌ల్పంగా రాణించాయి. ఇత‌ర అధిక వెయిటేజీ రంగాలు రెడ్‌లోనే ముగిశాయి. Dr.Reddy, Indus Indbk, Hdfc Life టాప్ గెయినర్స్, Titan, Hindalco, Adani Ports టాప్ లూజర్స్.

Similar News

News January 23, 2025

వచ్చే నెల 6న ఏపీ మంత్రివర్గ భేటీ

image

AP: ఫిబ్రవరి 6న ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. సీఎం అధ్యక్షతన దావోస్ పర్యటన, అమరావతి, పోలవరం పనులు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనుంది. వాట్సాప్ గవర్నెన్స్‌ వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనుంది.

News January 23, 2025

సంజూపై కుట్ర పన్నుతున్నారు: తండ్రి

image

సంజూ శాంసన్‌ను బీసీసీఐ విచారించనుందన్న నేపథ్యంలో కేరళ క్రికెట్ అసోసియేషన్‌పై ఆయన తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. KCA సంజూపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ‘6 నెలలుగా KCA కుట్రలు చేస్తోంది. అక్కడ నా బిడ్డ సురక్షితంగా లేడు. ప్రతిదానికి సంజూపై నిందలు వేస్తోంది. ప్రజలు కూడా వాటిని నమ్ముతున్నారు. అందుకే నా కొడుకు కేరళ తరఫున ఆడటం మానేయాలని నేను కోరుకుంటున్నా’ అని తెలిపారు.

News January 23, 2025

సుభాష్ చంద్రబోస్ రాసిన అరుదైన లేఖలు

image

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాసిన అరుదైన లేఖలను ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా షేర్ చేసింది. ‘ఇండియా కోసం నేతాజీ సిరా కూడా రక్తం చిందించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాసిన అరుదైన లేఖలు మీరూ చూసేయండి. ఇవి లేఖలే కాదు స్వతంత్ర భారతదేశం గురించి ఆయన కలలుగన్న లక్ష్యాలు, సంకల్పం, దృక్పథానికి సాక్ష్యాలు’ అని తెలిపింది.