News January 27, 2025
Stock Market: నేలచూపులు

దేశీయ స్టాక్ మార్కెట్లు Mon భారీగా నష్టపోయాయి. Sensex 824 PTS నష్టపోయి 75,366 వద్ద, Nifty 263 PTS పతనమై 22,829 వద్ద స్థిరపడ్డాయి. అధిక వెయిటేజీ రంగాలైన ఐటీ, బ్యాంకు, ఫైనాన్స్, ఆటో, ఫార్మా, రియల్టీ రంగాలు నేలచూపులు చూశాయి. India Vix 18.14గా నమోదవ్వడం కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడిని ప్రతిబింబిస్తుంది. Britannia, ICICI, M&M టాప్ గెయినర్స్. HCL, TechM, Wipro టాప్ లూజర్స్.
Similar News
News December 1, 2025
ఈ టీకాతో గర్భాశయ క్యాన్సర్కు 90% చెక్..!

మహిళలకు ప్రాణాంతకమైన గర్భాశయ క్యాన్సర్ను నివారించడంలో హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. HPV టీకా తీసుకున్న బాలికల్లో, టీకా తీసుకోని వారితో పోలిస్తే, గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 80% నుంచి 90% వరకు గణనీయంగా తగ్గినట్లు తాజా డేటా స్పష్టం చేసింది. టీకా తీసుకున్న తర్వాత 15-20 సంవత్సరాల పాటు రక్షణ ప్రభావం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
News December 1, 2025
చిన్న వయసులోనే టీకా ఎందుకు తీసుకోవాలంటే..?

గర్భాశయ క్యాన్సర్కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంక్రమించడానికి ముందే టీకా తీసుకోవడం వల్ల అత్యధిక రక్షణ లభిస్తుంది. అందుకే, లైంగిక చర్య ప్రారంభానికి ముందే, అంటే 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సులో బాలికలకు టీకా ఇవ్వాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాలికలకే కాకుండా పురుషాంగం, పాయువు, గొంతు క్యాన్సర్ల రక్షణ కోసం బాలురు కూడా ఈ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 1, 2025
శివుడు పుర్రెల దండ ఎందుకు ధరిస్తాడు?

పరమ శివుడు పుర్రెల దండ, చితాభస్మం ధరించి శ్మశానంలో తిరుగుతుంటాడు. అందుకు కారణం శిష్టరక్షణ. అసురులు ధర్మబద్ధంగా వరాలు పొంది దేవతలను హింసించేవారు. వారిని మోహానికి గురి చేయడానికి విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు శివుడు ఈ వేషం ధరించి, పాషండ మతాన్ని ఉపదేశించాడు. దీంతో వేద నింద, దైవ నింద చేసిన రాక్షసుల తేజస్సు క్షీణించింది. అలాగే వారి నుంచి దేవతలకు ఉపశమనం లభించింది. ఇది ధర్మ రక్షణకై హరిహరులు చేసిన లీల.


