News November 18, 2024
Stock Market: నష్టాల వైపు పయనం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల వైపు పయనిస్తున్నాయి. గత సెషన్లో అమెరికన్ సూచీలు భారీగా నష్టపోవడంతో భారత మార్కెట్లపై ప్రభావం కనిపిస్తోంది. సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 77,464 వద్ద, నిఫ్టీ (-30తో) 23,502 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మెటల్, ఫార్మా రంగాలు ప్రీ మార్కెట్‌ను లాభాలతో ఆరంభించాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, Oil & Gas నష్టాల్లో ఉన్నాయి.
Similar News
News November 18, 2024
రాజకీయ లబ్ధి కోసమే YCPపై ఆరోపణలు: బొత్స
AP: వైసీపీ హయాంలో క్రైమ్ రేట్ పెరిగిందన్న హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే లేని పోని ఆరోపణలు చేస్తున్నారని MLC బొత్స సత్యనారాయణ అన్నారు. శాంతిభద్రతలపై Dy.CM పవన్ ఆందోళన వ్యక్తం చేశారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అనిత వ్యాఖ్యలకు తాము వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు దమ్ము, ధైర్యం అంటూ మంత్రి మాట్లాడటం సరికాదని మండలి ఛైర్మన్ మోషన్ రాజు అన్నారు.
News November 18, 2024
లా అండ్ ఆర్డర్‌పై మండలిలో హాట్ హాట్ చర్చ
AP శాసనమండలిలో లా అండ్ ఆర్డర్‌పై చర్చ అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. రాష్ట్రంలో నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. జగన్ తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా అండగా నిలుస్తామని ఆమె అన్నారు. దీంతో అనిత వ్యాఖ్యలపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
News November 18, 2024
బీజేపీలో చేరనున్న గహ్లోత్!
కేజ్రీవాల్ తీరుపై తీవ్ర విమర్శలు చేసి మంత్రి పదవికి <<14635271>>రాజీనామా<<>> చేసిన కైలాష్ గహ్లోత్ బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు గహ్లోత్ సన్నిహితుడు. పంద్రాగస్టున జెండా ఎగురవేసేందుకు ఆతిశీకి బదులుగా గహ్లోత్‌కు సక్సేనా అవకాశం ఇచ్చారు. పైగా లిక్కర్ కేసులో ఆయన పాత్రపై ED కూపీ లాగుతుండడంతోనే బీజేపీలో చేరుతున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.