News December 5, 2024
Stock Market: భారీ లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం అనూహ్యంగా పుంజుకున్నాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకానొక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల లాభాన్ని అర్జించింది. చివరికి 809 పాయింట్ల లాభంతో 81,765 వద్ద, నిఫ్టీ 240 పాయింట్ల లాభంతో 24,708 వద్ద స్థిరపడ్డాయి. అత్యధికంగా ఐటీ షేర్లు 1.95% లాభపడ్డాయి. Trent, Infy, TCS, Titan టాప్ గెయినర్స్. Sbi Life, HDFC life, BajajAuto టాప్ లూజర్స్.
Similar News
News February 5, 2025
Way2Newsలో ఎక్స్‌క్లూజివ్‌గా ఎగ్జిట్ పోల్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కానున్నాయి. ఢిల్లీ పీఠం ఎవరిదనే దానిపై యాక్సిస్ మై ఇండియా, సీ ఓటర్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. Way2Newsలో వేగంగా, ఎక్స్‌క్లూజివ్‌గా ఎగ్జిట్ పోల్స్ తెలుసుకోవచ్చు.
News February 5, 2025
కనిపించని కళాఖండానికి రూ.15లక్షలు!
కంటికి అద్భుతంగా కనిపించే కళాఖండాన్ని రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేయడం చూస్తుంటాం. కానీ, అసలు భౌతికంగా లేని ఓ ఆర్ట్‌ను $18,300 (రూ.15లక్షలు)కు కొనుగోలు చేశారు. ఇటాలియన్ కళాకారుడు సాల్వటోర్ గరౌ భౌతికంగా కనిపించని శిల్పాన్ని రూపొందించారు. అయితే ఇది భౌతికంగా కనిపించనప్పటికీ అక్కడ ఏదో రూపం ఉందనే భావనే కలుగుతోందని చెప్పుకొచ్చారు. దీనిని విక్రయించేందుకు వేలం నిర్వహించగా భారీ డిమాండ్ కనిపించింది.
News February 5, 2025
జగన్ 2.O చూడబోతున్నారు: YS జగన్
AP: ఈసారి జగన్ 2.Oని చూడబోతున్నారని YS జగన్ అన్నారు. ‘2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పని చేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయ పడ్డా. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయా. ఇప్పుడు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను. ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా’ అని జగన్ హెచ్చరించారు.