News December 5, 2024
Stock Market: భారీ లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం అనూహ్యంగా పుంజుకున్నాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకానొక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల లాభాన్ని అర్జించింది. చివరికి 809 పాయింట్ల లాభంతో 81,765 వద్ద, నిఫ్టీ 240 పాయింట్ల లాభంతో 24,708 వద్ద స్థిరపడ్డాయి. అత్యధికంగా ఐటీ షేర్లు 1.95% లాభపడ్డాయి. Trent, Infy, TCS, Titan టాప్ గెయినర్స్. Sbi Life, HDFC life, BajajAuto టాప్ లూజర్స్.
Similar News
News January 22, 2025
ఎలా ఆడాలో రోహిత్‌కు చెప్పక్కర్లేదు: రహానే
రోహిత్ శర్మ పదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడబోతున్నారు. రేపు J&Kతో మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా ముంబై కెప్టెన్ రహానే మాట్లాడుతూ ‘రోహిత్ ఏంటో అందరికీ తెలుసు. నేషనల్, ఇంటర్నేషనల్ ఏ మ్యాచ్ ఆడినా ఒకేలా ఉంటాడు. ఆట గురించి అతనికి బాగా తెలుసు. ఏం చేయాలో ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదు. అతడిచ్చే ఇన్ పుట్స్ మాకు చాలా ముఖ్యం. రోహిత్ తిరిగి ఫామ్‌లోకి వస్తాడనే నమ్మకముంది’ అని చెప్పారు.
News January 22, 2025
ఆయుష్మాన్ భారత్‌కు ‘ఆప్’ద అడ్డంకులు: మోదీ
ఆమ్‌ఆద్మీ వంచన, అబద్ధాలకు శీశ్‌మహలే పెద్ద ఉదాహరణ అని PM మోదీ అన్నారు. ఢిల్లీ BJP కార్యకర్తలతో మాట్లాడారు. ‘ఉచిత వైద్యం అందించే ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని ‘ఆప్’ద మనుషుల్ని కోరాం. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. ఎన్నో ప్రయోజనాలున్న ఈ స్కీమ్ అమలుకు ఆప్‌ద అడ్డంకులు సృష్టించింది. భారత ఎకానమీకి మిడిల్‌క్లాసే వెన్నెముకని బీజేపీ భావిస్తుంది. వారి ఆశలు, ఆశయాలను మనం అర్థం చేసుకున్నాం’ అని అన్నారు.
News January 22, 2025
9 ఏళ్లకే పెళ్లిని అనుమతించేలా చట్టం తెచ్చారు
ఆచారాలకు ప్రాధాన్యత అంటూ కొత్త చట్టాలతో విమర్శల పాలవుతున్న ఇరాక్ పాలకులు మరో వివాదాస్పద బిల్ పాస్ చేశారు. దీంతో గతంలో 18సం.గా ఉన్న అమ్మాయిల కనీస వివాహ వయస్సు నిబంధన మారనుంది. మతంలోని ఒక తెగ/వర్గం నిబంధనల ప్రకారం పెళ్లి చేయొచ్చు. అక్కడ షియత్‌లు ఎక్కువగా అనుసరించే జాఫరీ ఇస్లామిక్ లా ప్రకారం 9 ఏళ్ల బాలికకూ పెళ్లి చేయొచ్చు. దీంతో మహిళల జీవితాలు ప్రమాదంలో పడతాయని ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేస్తోంది.