News August 13, 2024
Stock Market: భారీ నష్టాలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. సెబీ చీఫ్ మాధబిపై హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసి ఒక రోజు ట్రేడింగ్ సెషన్ ముగిసిన తరువాత సూచీలు నష్టాల బాటపట్టడం గమనార్హం. సెన్సెక్స్ 692 పాయింట్ల నష్టంతో 78,956 వద్ద నిలిచింది. నిఫ్టీ 208 పాయింట్లు నష్టపోయి 24,150 దిగువకు చేరింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లు టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
Similar News
News April 18, 2026
ట్రంప్‌కు పంచ్.. హార్ముజ్‌పై బాంబు పేల్చిన ఇరాన్

హార్ముజ్‌ను తెరవడంపై ఇరాన్ మెలిక పెట్టింది. జలసంధిని US దిగ్బంధిస్తే తాము మళ్లీ మూసివేస్తామని ఇరాన్ నేత గాలిబాఫ్ ప్రకటించారు. ప్రయాణించే నౌకలు తమ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. హార్ముజ్ తెరవడమా, మాసివేయడమా అనేది క్షేత్రస్థాయిలో నిర్ణయిస్తామని, SMలో కాదంటూ ట్రంప్‌పై సెటైర్ వేశారు. అబద్ధాలు చెప్పి ఆయన యుద్ధంలో గెలవలేరని, ఇలా మాట్లాడితే శాంతి చర్చల్లోనూ ఏమీ సాధించలేరని చురకలంటించారు.
News April 18, 2026
ALERT: ఎండలో బయటికెళ్తున్నారా?

ఉష్ణోగ్రతలు పెరగడంతో వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విపరీతమైన తలనొప్పి, 104 డిగ్రీలకు పైగా జ్వరం, వాంతులు, శ్వాస వేగంగా తీసుకోవడం, చర్మం ఎర్రబడి పొడిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే నెగ్లెక్ట్ చేయొద్దని చెబుతున్నారు. నివారణకు తరచుగా నీరు, ORS తాగాలని, మధ్యాహ్నం వేళ ప్రయాణాలు తగ్గించి, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. SHARE IT
News April 18, 2026
రష్యా చమురు కొనుగోలుకు US అనుమతుల పొడిగింపు

రష్యా నుంచి భారత్ సహా ఇతర దేశాలు చమురు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతులను అమెరికా మరో నెల రోజులపాటు పొడిగించింది. మే 16 వరకు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. ఇది ఇరాన్, క్యూబా, ఉ.కొరియాతో జరిగే లావాదేవీలకు వర్తించదని పేర్కొంది. యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలను నియంత్రించడానికి US ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అనుమతులను పొడిగించబోమని 2రోజుల క్రితం US చెప్పడం గమనార్హం.


