News August 13, 2024

Stock Market: భారీ నష్టాలు

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీ న‌ష్టాలు మూట‌గ‌ట్టుకున్నాయి. సెబీ చీఫ్ మాధ‌బిపై హిండెన్‌బ‌ర్గ్ ఆరోప‌ణ‌లు చేసి ఒక రోజు ట్రేడింగ్ సెష‌న్ ముగిసిన త‌రువాత సూచీలు నష్టాల బాటపట్టడం గమనార్హం. సెన్సెక్స్ 692 పాయింట్ల నష్టంతో 78,956 వద్ద నిలిచింది. నిఫ్టీ 208 పాయింట్లు న‌ష్ట‌పోయి 24,150 దిగువకు చేరింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లు టాప్ లూజ‌ర్స్‌గా నిలిచాయి.

Similar News

News September 10, 2024

బిల్లులు క్లియర్ చేయండి: యూనస్‌కు అదానీ లేఖ

image

బంగ్లా పవర్ బోర్డు నుంచి రావాల్సిన $800 మిలియన్ల బకాయిలను త్వరగా ఇప్పించాలని ఆ దేశ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్‌ను అదానీ పవర్ కోరింది. ఈ అంశంలో జోక్యం చేసుకొని బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని లేఖ రాసింది. ఝార్ఖండ్ ప్లాంట్ నుంచి అదానీ కంపెనీ బంగ్లాకు విద్యుత్ సరఫరా చేస్తోంది. నెలకు $90-95 మిలియన్లు తీసుకుంటుంది. కొన్ని నెలలుగా అందులో సగం వరకే చెల్లిస్తుండటంతో బకాయిలు పేరుకుపోయాయి.

News September 10, 2024

ప్రమాదాలను నివారించిన రైల్వే సిబ్బందికి సన్మానం

image

TG: భారీ వర్షాల సమయంలో రైల్వే ట్రాక్‌లు ధ్వంసమైన ప్రదేశాలను గుర్తించి పైఅధికారులకు చెప్పి, ప్రమాదాలను నివారించిన వారిని రైల్వేశాఖ సన్మానించింది. సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆరుగురు సిబ్బందికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. G.మోహన్(ఇంటికన్నె), B.జగదీశ్(తాళ్లపూసపల్లి), K.కృష్ణ, B.జైల్‌సింగ్, V.సైదానాయక్, P.రాజమౌళి(మహబూబాబాద్) ఉన్నారు.

News September 10, 2024

రూ.500 లాటరీతో రూ.2.5 కోట్లు గెలిచాడు!

image

పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ప్రీతమ్ లాల్ పాత సామాన్లు కొనుగోలు చేస్తుంటారు. అలా వచ్చిన డబ్బులతో గత 50 ఏళ్లుగా లాటరీ టికెట్స్ కొంటున్న ఆయనకు ప్రతిసారి నిరాశే ఎదురయ్యేది. ఇక లాటరీలు కొనవద్దు అనుకోగా.. భార్య చెప్పడంతో ఇదే చివరిదని రూ.500 పెట్టి కొనుగోలు చేశారు. ఇన్నిరోజులు అతని సహనాన్ని పరీక్షించిన అదృష్టం ఆ లాటరీతో ప్రీతమ్ ఇంటి తలుపు తట్టింది. పంజాబ్ స్టేట్ లాటరీలో ఆయన రూ.2.5 కోట్లు గెలుపొందారు.