News August 8, 2024
Stock Market: మళ్లీ నష్టాలు

RBI వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో దేశీ స్టాక్ మార్కెట్లు వొలటైల్ అయ్యాయి. సెన్సెక్స్ 582, నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయాయి. ఎర్నింగ్స్ అండ్ గ్రోత్ పరంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ని ఓవర్ వ్యాల్యూగా పరిగణిస్తూ ఇన్వెస్టర్లు జాగ్రత్తపడినట్టు నిపుణులు చెబుతున్నారు. ఎమర్జింగ్ మార్కెట్స్తో పోలిస్తే హై వ్యాల్యూయేషన్ కూడా నష్టాలకు కారణమని చెబుతున్నారు.
Similar News
News January 6, 2026
రాష్ట్రంలో 424 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 6, 2026
సక్సెస్తో వచ్చే కిక్కే వేరు: CBN

AP: 2025లో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని, అదే ఉత్సాహంతో 2026లోనూ ముందుకెళ్లాలని CM CBN SIPB సమావేశంలో సూచించారు. ‘టాటా, జిందాల్, బిర్లా, ADANI, RIL,TCS, కాగ్నిజెంట్ వంటివి పెట్టుబడులు పెడుతున్నాయి. గ్రౌండింగ్లో పొరపాట్లకు తావుండొద్దు. 2029కి విద్యుత్ కొనుగోలు ఛార్జీ ₹3.70కి తగ్గేలా చేద్దాం’ అని పేర్కొన్నారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందని, దాని కోసం అందరూ పని చేయాలని వ్యాఖ్యానించారు.
News January 6, 2026
బెండలో బూడిద, పల్లాకు తెగులు నివారణ

☛ బూడిద తెగులు వల్ల ఆకులు పచ్చబడి రాలిపోతాయి. నివారణకు లీటర్ నీటిలో 3 గ్రా. కరిగే గంధకపు పొడి లేదా 1mlడైనోకాప్ (లేదా) 2mlహెక్సాకొనజోల్ కలిపి పిచికారీ చేయాలి. ☛ బెండలో పల్లాకు తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. పల్లాకు తెగులు నివారణకు లీటర్ నీటిలో 2.5 గ్రా. క్లోరోథలానిల్ (లేదా) 2.5 గ్రా. మ్యాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి.


