News August 8, 2024
Stock Market: మళ్లీ నష్టాలు
RBI వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో దేశీ స్టాక్ మార్కెట్లు వొలటైల్ అయ్యాయి. సెన్సెక్స్ 582, నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయాయి. ఎర్నింగ్స్ అండ్ గ్రోత్ పరంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌ని ఓవర్ వ్యాల్యూగా పరిగణిస్తూ ఇన్వెస్టర్లు జాగ్రత్తపడినట్టు నిపుణులు చెబుతున్నారు. ఎమర్జింగ్ మార్కెట్స్‌తో పోలిస్తే హై వ్యాల్యూయేషన్ కూడా నష్టాలకు కారణమని చెబుతున్నారు.
Similar News
News September 18, 2024
క్యాబినెట్ భేటీ ప్రారంభం
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీలో కొత్త లిక్కర్ పాలసీతో పాటు పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వాలంటీర్ వ్యవస్థపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
News September 18, 2024
నటి CID శకుంతల కన్నుమూత
దక్షిణాది నటి CID శకుంతల(84) కన్నుమూశారు. బెంగళూరులో ఛాతి నొప్పితో నిన్న తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో దాదాపు 600 సినిమాల్లో, పలు సీరియళ్లలో నటించారు. MGR, శివాజీ వంటి లెజెండరీ యాక్టర్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తెలుగులో బుద్ధిమంతుడు, నేను మనిషినే వంటి పలు సినిమాల్లో ఆమె కనిపించారు.
News September 18, 2024
ఓటీటీలోకి ’35 చిన్న కథ కాదు’.. ఎప్పుడంటే?
ఈనెల 6న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ’35 చిన్న కథ కాదు’ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈనెల 27 నుంచి ‘ఆహా’లో ఈ మూవీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నందకిశోర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియదర్శి, విశ్వదేవ్, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.