News October 7, 2024
Stock Market: మళ్లీ నష్టాలు

FIIల అమ్మకాలు, మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ భయాలతో బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు సోమవారం కూడా భారీ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 638 పాయింట్ల నష్టంతో 81,050 వద్ద, నిఫ్టీ 218 పాయింట్ల నష్టంతో 24,795 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం గ్యాప్ అప్‌తో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. 24,800 వద్ద నిఫ్టీకి మద్దతు దొరికినా 25,000 వద్ద ఉన్న బలమైన రెసిస్టెన్స్ సూచీని మళ్లీ నష్టాల్లోకి నెట్టింది.
Similar News
News July 6, 2025
టెక్సాస్ వరదలు.. 32కు చేరిన మృతుల సంఖ్య

అమెరికాలోని టెక్సాస్‌లో అకాల వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కెర్ కౌంటీ షెరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరదల వల్ల చనిపోయినవారి సంఖ్య 32కు చేరుకుంది. మృతుల్లో 18 మంది పెద్దవాళ్లుకాగా.. 14 మంది చిన్నారులు ఉన్నారు. గల్లంతైన 27 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. రికవరీ చేసిన 8 మృతదేహాలు ఎవరివో గుర్తించలేకపోతున్నారు. మృతుల కుటుంబాలకు అధ్యక్షుడు ట్రంప్ సానుభూతి తెలియజేశారు.
News July 6, 2025
తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటే?

ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి/శయన ఏకాదశి అంటారు. ఈరోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు. ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ఈరోజు పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని, ఏకాదశి రోజున ఉపవాసముంటే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ ఒక్కరోజు ఉపవాసముంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఉపవాస ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు.
News July 6, 2025
ప్రపంచస్థాయి కెమికల్ హబ్స్ రావాలి: నీతిఆయోగ్

ప్రపంచస్థాయి కెమికల్స్ హబ్స్ స్థాపనపై కేంద్రం దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్ ఓ నివేదికలో పేర్కొంది. ‘అత్యధిక సామర్థ్యాలుండే 8 పోర్ట్-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌నూ స్థాపించాలి. 2040నాటికి భారత్ లక్షకోట్ల డాలర్ల రసాయనాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. 2023లో గ్లోబల్ వ్యాల్యూ చెయిన్‌లో 3.5%గా ఉన్న వాటా 2040నాటికి 4-5శాతానికి పెరగనుంది. 2030నాటికి 7 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది’ అని నివేదికలో వివరించింది.