News October 11, 2024
Stock Market: ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఫలితాల సీజన్ ఆరంభమవ్వడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రస్తుతం BSE సెన్సెక్స్ 23 పాయింట్లు పెరిగి 81,637 వద్ద ట్రేడవుతోంది. NSE నిఫ్టీ 18 పాయింట్లు ఎగిసి 25,015 వద్ద చలిస్తోంది. హిందాల్కో, టాటా స్టీల్, ఐచర్, JSW స్టీల్, ONGC టాప్ గెయినర్స్. సిప్లా, TCS, ASIAN PAINTS, ICICI బ్యాంక్, ITC టాప్ లూజర్స్.
Similar News
News February 2, 2026
Budget: గోల్డ్ బాండ్స్ ఇకపై ట్యాక్స్ ఫ్రీ కాదా?

బడ్జెట్‌లో గోల్డ్ బాండ్ల పన్ను మినహాయింపును కుదించారు. ఇకపై RBI ఈ బాండ్లను ఇష్యూ చేసినప్పుడే నేరుగా కొని మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటేనే పన్ను ఉండదు. ఒకవేళ స్టాక్ మార్కెట్‌లో ఇతరుల దగ్గర కొనుగోలు చేస్తే మెచ్యూరిటీ సమయంలో వచ్చే లాభంపై కచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. అలాగే మెచ్యూరిటీ కంటే ముందు అమ్మినా పన్ను తప్పదు. అయితే ఏటా వచ్చే 2.5% వడ్డీపై పాత పద్ధతిలోనే పన్ను వర్తిస్తుంది.
News February 2, 2026
అభిషేక్ శర్మపై రికీ పాంటింగ్ ప్రసంశలు

T20 WCలో భారత స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం T20 నంబర్ వన్ ర్యాంకర్‌గా ఉన్న అభిషేక్, తన మెరుపు బ్యాటింగ్‌తో భారత్‌ను విజేతగా నిలుపుతాడని పాంటింగ్ అభిప్రాయపడ్డారు. భారత్, శ్రీలంక వేదికలుగా FEB 7 నుంచి మొదలవనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి.
News February 2, 2026
DRDOలో రీసెర్చ్ అసోసియేట్, JRF పోస్టులు

<


