News October 16, 2024
STOCK MARKET: మళ్లీ 25,000 కిందకు నిఫ్టీ
బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం ఇన్వెస్టర్లలో నెగటివ్ సెంటిమెంటును పెంచింది. BSE సెన్సెక్స్ 81,501 (-318), NSE నిఫ్టీ 24,971 (-86) వద్ద క్లోజయ్యాయి. HDFC లైఫ్, Dr రెడ్డీస్, గ్రాసిమ్, ఎయిర్‌టెల్, HDFC బ్యాంక్ టాప్ గెయినర్స్. ట్రెంట్, M&M, హీరోమోటో, ఇన్ఫీ, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్. నేడు ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టి, టెలికం సూచీలు పెరిగాయి.
Similar News
News November 4, 2024
విజయవాడ-శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’.. 9న ప్రయోగం
AP: విజయవాడ పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’ జర్నీకి ఈ నెల 9న CM చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఆ 2 ప్రాంతాల మధ్య దీన్ని నడిపేందుకు ఉన్న అనుకూలతలపై అధికారులు తొలుత ప్రయోగం నిర్వహిస్తారు. ఇది విజయవంతమైతే రెగ్యులర్ సర్వీసును ప్రారంభిస్తారు. దీనివల్ల పర్యాటక రంగానికి మరింత ఊతం వస్తుందని భావిస్తున్నారు.
News November 4, 2024
నేడే ఫలితాలు విడుదల
ఏపీ టెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్‌ను అధికారికంగా రిలీజ్ చేస్తారు. అభ్యర్థులు <
News November 4, 2024
విజయ్ దేవరకొండ సినిమాలో ‘ది మమ్మీ’ నటుడు?
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఇందులో హాలీవుడ్ సినిమా ‘ది మమ్మీ’తో పాపులరైన ఆర్నాల్డ్ వోస్లూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. 1854-78 మధ్య కాలంలో జరిగే ఈ కథలో విజయ్ పాత్ర తర్వాత ఆయన క్యారెక్టర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఈ మూవీ షూటింగ్ 2025 జనవరి నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సుంది.