News September 30, 2024
Stock Market: నష్టాల్లో నడుస్తున్నాయ్

అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, TCS, ICICI గ్యాప్ డౌన్తో ఓపెన్ అవ్వడంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో నడుస్తున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 500 పాయింట్ల నష్టంతో 85,060 వద్ద, నిఫ్టీ 150 పాయింట్ల నష్టంతో 26,030 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇటీవల చైనా Central Bank వడ్డీ రేట్ల కోతతో FIIల మనీ ఫ్లో ఆ దేశ మార్కెట్లలో అధికంగా ఉండడం కూడా మన మార్కెట్ల నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
Similar News
News November 28, 2025
గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి) ఎలా గుర్తించాలి?

ఇది ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.
News November 28, 2025
తిరుమల శ్రీవారి పుష్పాలను ఏం చేస్తారో తెలుసా?

తిరుమల శ్రీవారి సేవ కోసం రోజుకు కొన్ని వందల కిలోల పూలు వాడుతారు. మరి వాటిని ఏం చేస్తారో మీకు తెలుసా? పూజ తర్వాత వాటిని బయట పడేయరు. తిరుపతికి తరలిస్తారు. అక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలోని పూల ప్రాసెసింగ్ యూనిట్కు పంపుతారు. ఈ యూనిట్లో ఈ పూల నుంచి పరిమళభరితమైన అగరబత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలను తయారుచేస్తారు. తద్వారా పూల పవిత్రతను కాపాడుతూనే, వాటిని ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మారుస్తారు.
News November 28, 2025
2026 సెలవుల జాబితా విడుదల

కేంద్రం 2026 సంవత్సరానికి అధికారిక <


