News September 30, 2024

Stock Market: నష్టాల్లో నడుస్తున్నాయ్

image

అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, TCS, ICICI గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవ్వ‌డంతో సెన్సెక్స్, నిఫ్టీ న‌ష్టాల్లో న‌డుస్తున్నాయి. సెన్సెక్స్ ప్ర‌స్తుతం 500 పాయింట్ల న‌ష్ట‌ంతో 85,060 వ‌ద్ద‌, నిఫ్టీ 150 పాయింట్ల న‌ష్టంతో 26,030 వ‌ద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇటీవ‌ల చైనా Central Bank వ‌డ్డీ రేట్ల కోత‌తో FIIల మనీ ఫ్లో ఆ దేశ మార్కెట్లలో అధికంగా ఉండడం కూడా మన మార్కెట్ల నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

Similar News

News October 9, 2024

బాబుకు చింత చచ్చినా పులుపు చావలేదు: రోజా

image

AP: CM చంద్రబాబు తీరు చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుందని YCP నేత రోజా ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూపై కల్తీ ఆరోపణలు చేసి హిందువుల మనోభావాలు గాయపరిచారని మండిపడ్డారు. ‘CBI సిట్‌ వేసిన సుప్రీం రాజకీయ విమర్శలు చేయొద్దని ఆదేశించింది. కానీ దానిపై తాను మాట్లాడకుండా తన అనుకూల మీడియాలో కల్తీ వార్తలు ప్రచారం చేయిస్తున్నారు. కల్తీ రాజకీయాలు చేసేవారే కల్తీ ప్రచారాన్ని నమ్ముతారు’ అని ఆమె ట్వీట్ చేశారు.

News October 9, 2024

రాష్ట్రంలో 30 జిల్లాలు అని ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన CM

image

AP: రాష్ట్రంలో 30 జిల్లాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మార్కాపురం, మదనపల్లె, ఇతర కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామనే హామీలున్నాయని, కానీ ఆ ప్రక్రియ ఇప్పట్లో ఉండదని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలు ఉండగా వాటిని 30కి పెంచినట్లు ఓ ఫేక్ జీవో వైరల్ అవుతోంది.

News October 9, 2024

రింకూ, నితీశ్ ఫిఫ్టీ: బంగ్లాదేశ్‌కు భారీ టార్గెట్

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమ్ ఇండియా భారీ స్కోర్ సాధించింది. తక్కువ స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయినా నితీశ్ కుమార్ రెడ్డి (74), రింకూ సింగ్ (53) ఫిఫ్టీలతో మెరుపులు మెరిపించారు. ఇద్దరూ చెలరేగి ఆడగా, భారత్ ఓవర్లన్నీ ఆడి 221/9 రన్స్ చేసింది. చివర్లో హార్దిక్ పాండ్య (32) దూకుడుగా ఆడారు. బంగ్లా బౌలర్లలో హోస్సేన్ 3, తస్కిన్ అహ్మద్, హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ తలో రెండు వికెట్లు తీశారు.