News January 28, 2025
Stock Market: ఈ రోజు లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. గత సెషన్లో ఎదురైన నష్టాల నుంచి సూచీలు ఒకింత ఉపశమనం పొందాయి. సెన్సెక్స్ 535 పాయింట్ల లాభంతో 75,901 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు ఎగసి 22,957 వద్ద స్థిరపడ్డాయి. ఒకానొక దశలో బీఎస్ఈ సూచీ 900 PTS, నిఫ్టీ 220 పాయింట్లు ఎగసినా కొనుగోళ్లలో అస్థిరత వల్ల తదుపరి రివర్సల్ తీసుకున్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, రియల్టీ షేర్లు రాణించాయి.
Similar News
News December 9, 2025
గ్లోబల్ సమ్మిట్@ రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. 2 రోజుల పాటు జరిగిన సదస్సులో మొత్తంగా ₹5.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి రోజు ₹2,43,000 కోట్ల ఒప్పందాలు జరగ్గా మిగతా పెట్టుబడులపై 2వ రోజు MOUలు కుదిరాయి. విద్యుత్ రంగంలో ₹3,24,698 కోట్లు, AI, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో ₹70,000 కోట్ల ఒప్పందాలు కుదిరాయి.
News December 9, 2025
పీకల్లోతు కష్టాల్లో భారత్

కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి T20లో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన IND మూడో బంతికే వైస్ కెప్టెన్ గిల్(4) వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్(12) కూడా ఎంగిడి బౌలింగ్లోనే గిల్ తరహాలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. అభిషేక్(17) దూకుడుకు బౌలర్ సిపామ్లా బ్రేకులేశారు. IND స్కోర్ 7 ఓవర్లలో 50/3.
News December 9, 2025
తెలంగాణకు పెట్టుబడుల ‘పవర్’

TG: గ్లోబల్ సమ్మిట్లో పవర్(విద్యుత్) సెక్టార్కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. మొత్తం రూ.3,24,698 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా 1,40,500 ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జెన్కో, రెడ్కో, సింగరేణి సంస్థలు వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నాయని వెల్లడించారు.


