News January 28, 2025
Stock Market: ఈ రోజు లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. గత సెషన్‌లో ఎదురైన నష్టాల నుంచి సూచీలు ఒకింత ఉపశమనం పొందాయి. సెన్సెక్స్ 535 పాయింట్ల లాభంతో 75,901 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు ఎగసి 22,957 వద్ద స్థిరపడ్డాయి. ఒకానొక దశలో బీఎస్ఈ సూచీ 900 PTS, నిఫ్టీ 220 పాయింట్లు ఎగసినా కొనుగోళ్లలో అస్థిరత వల్ల తదుపరి రివర్సల్ తీసుకున్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, రియల్టీ షేర్లు రాణించాయి.
Similar News
News February 9, 2025
GBS కలకలం.. రాష్ట్రంలో తొలి మరణం

తెలంగాణలో తొలి GBS(గిలియన్ బార్ సిండ్రోమ్) <<15404745>>మరణం <<>>సంభవించింది. ఈ వ్యాధితో బాధపడుతున్న మహిళ ప్రాణాలు విడిచింది. సిద్దిపేట సమీపంలోని సీతారాంపల్లికి చెందిన వివాహిత(25) నెల రోజుల క్రితం నరాల నొప్పులతో స్థానిక ఆస్పత్రిలో చేరింది. ఆ తర్వాత HYD నిమ్స్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. నిన్న చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
News February 9, 2025
కరీబియన్ సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక

హోండురస్‌కు ఉత్తర దిక్కున కరీబియన్ సముద్రంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. సముద్రానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని జర్మన్ రిసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ సంస్థ తెలిపింది. ఈ ప్రాంతంలో 2021 తర్వాత ఇదే అతి పెద్ద భూకంప తీవ్రత కావడంతో కరీబియన్ సముద్రం చుట్టపక్కల ఉన్న హోండురస్, ప్యూర్టోరికో, వర్జిన్ ఐలాండ్స్‌కు అమెరికా సముద్ర, పర్యావరణ పరిశీలన సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
News February 9, 2025
తెలంగాణ ప్రీమియర్ లీగ్ మళ్లీ వచ్చేస్తోంది!

యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రీమియర్ లీగ్ టోర్నీని ఈ ఏడాది నుంచి తిరిగి ప్రారంభిస్తామని HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు వెల్లడించారు. తిలక్ వర్మ ఈ టోర్నీ ద్వారానే వెలుగులోకి వచ్చాడని తెలిపారు. ఒక్కో ఉమ్మడి జిల్లాకు రూ.కోటి చొప్పున కేటాయించి గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఉమ్మడి జిల్లాల్లో 10 ఎకరాల్లో కొత్త స్టేడియాలు నిర్మిస్తామని చెప్పారు.