News January 1, 2025
Stock Markets: న్యూఇయర్లో శుభారంభం
2025 మొదటి సెషన్లో బెంచ్‌మార్క్ సూచీలు భారీగా లాభపడ్డాయి. AUTO, MEDIA, CONSUMPTION షేర్లు దన్నుగా నిలవడంతో సెన్సెక్స్ 78,507 (+368), నిఫ్టీ 23,742 (+98) వద్ద ముగిశాయి. మెటల్, రియాల్టి మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. MARUTI, M&M, LT, BAJAJFIN, TATAMOTORS టాప్ గెయినర్స్. HINDALCO, DRREDDY, ADANIPORTS, ONGC, TATASTEEL టాప్ లూజర్స్. ఫియర్ ఇండెక్స్ INDIA VIX 14.51 వద్ద ఉండటం అనిశ్చితిని సూచిస్తోంది.
Similar News
News January 4, 2025
రోహిత్.. హ్యాట్సాఫ్: మంజ్రేకర్
రోహిత్ శర్మ తాను ఫామ్‌లో లేనని ఒప్పుకోవడాన్ని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కొనియాడారు. ‘హ్యాట్సాఫ్ రోహిత్. మరీ ఎక్కువమంది ఫామ్ లేని ఆటగాళ్లు సిడ్నీ టెస్టులో ఆడటం మంచిది కాదని తాను తప్పుకున్నానన్నారు. ఇంటర్వ్యూలో అత్యంత నిజాయితీతో మాట్లాడారు’ అని ట్వీట్ చేశారు. కాగా.. తనకు రిటైర్మెంట్ ఆలోచన లేదని, ఈ మ్యాచ్‌కు మాత్రం తానే తప్పుకొన్నానని రోహిత్ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే.
News January 4, 2025
చంద్రబాబు గారూ ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా?: జగన్
AP: వరుసగా క్యాబినెట్ భేటీలు జరుగుతున్నా ‘తల్లికి వందనం’ ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పట్లేదని ప్రభుత్వాన్ని YS జగన్ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఎందరు పిల్లలుంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ‘ఈ ఏడాదికి తల్లికి వందనం ఇవ్వబోమని తేల్చిచెప్పేశారు. చంద్రబాబు గారూ ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా?’ అని ట్వీట్ చేశారు. రైతు భరోసా ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.
News January 4, 2025
5 ఎకరాల్లోపే రైతుభరోసా ఇవ్వాలని వినతి
TG: రైతుభరోసా పథకాన్ని 5 ఎకరాలలోపు రైతులకే అమలు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వాన్ని కోరింది. బీడు భూములకు, వందల ఎకరాలున్న వారికి పథకం అమలు చేస్తే ఖజానాపై భారం పడుతుందని పేర్కొంది. భూస్వాములు, IT చెల్లించే శ్రీమంతులను పథకానికి దూరం చేయాలని కోరింది. కౌలు రైతులను ఈ పథకంతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ పథకం కోసం రేపటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి, జనవరి 14న నగదు జమ చేయనుంది.